ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా దాదాపు వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మాత్రం కాంట్రవర్సీలను కొని తెచ్చుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి కస్తూరి పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ లోపల, బయట ఎలాంటి ఇష్యూస్ జరిగినా వెంటనే తనదైన శైలిలో వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా రియాక్ట్ అయిన కస్తూరి.. ఎన్టీఆర్ ని ట్రోల్ చేసినవారిపై స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా దాదాపు వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మాత్రం కాంట్రవర్సీలను కొని తెచ్చుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి కస్తూరి పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. సినీ నటిగా ఎన్నో సినిమాలు చేసిన కస్తూరి.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో సీరియల్స్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగులో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో ఒక్కసారిగా కస్తూరి క్రేజ్ అలా పెరిగిపోయిందని చెప్పాలి. అయితే.. నటిగా పాత్రకు అనువైన విధంగా డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేసే కస్తూరి.. పర్సనల్ గా లైఫ్ ని చాలా బోల్డ్ గా మాట్లాడుతూ లీడ్ చేస్తోంది.
ఇక 48 ఏళ్ళ వయసులో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపే కస్తూరి.. ఇండస్ట్రీ లోపల, బయట ఎలాంటి ఇష్యూస్ జరిగినా వెంటనే తనదైన శైలిలో వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటుంది. ఇటీవల యాంకర్ అనసూయ ఫేస్ చేస్తున్న ‘ఆంటీ’ వివాదంలో జోక్యం చేసుకొని.. నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చింది. మిడిల్ ఏజ్ విమెన్స్ ని ఆంటీ అంటే.. అదే ఏజ్ లో ఉన్న హీరోలను అంకుల్ అని పిలవగలరా? అని.. యూత్ ఎవరినైనా ఆంటీ అని పిలిస్తే వారి మాటల వెనుక ఉద్దేశం వేరే ఉంటుందని కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో మంచు లక్ష్మి మాట్లాడే తెలుగు భాషపై కూడా కామెంట్స్ చేస్తూ.. ట్రోలర్స్ కి సపోర్ట్ గా నిలిచింది.
సరే అంతటితో ఊరుకుందా? అంటే.. లేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ఎన్టీఆర్ యాక్సెంట్ పై ఎంతోమంది ట్రోల్ చేశారు. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన కస్తూరి.. ఎన్టీఆర్ ని ట్రోల్ చేసినవారిపై స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ ని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని.. అమెరికాలో జరిగిన ఈవెంట్ లో అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడితేనే అక్కడివారికి అర్థమవుతుందని కస్తూరి చెప్పుకొచ్చింది. అంతేగాక ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ట్రోలర్స్ కి, నెటిజన్స్ కి చురకలు పెడుతూ కౌంటర్స్ వేసిన నటి కస్తూరి మాటలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. మరి నటి కస్తూరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.