సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమలహాసన్ భారతీయుడు సినిమాతో అందరినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. భక్తిరస చిత్రంలోనూ అందాలను ఆరబోసింది. అయితే తెలుగులో పెద్ద బ్రేక్ రాకపోవడంతో ఇతర భాషలకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కస్తూరి.. మాటీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో తన అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇందులో మధ్య తరగతి గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయిందనే ప్రశంసలు వస్తున్నాయి. సీరియల్ లో ఎంతో పద్దతిగా సాంప్రదాయంగా కనిపించే కస్తూరి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా కస్తూరి టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై సంచలన కామెంట్స్ చేసింది.
టీమిండియా వైస్ కెప్టెన్, లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌పై ప్రముఖ నటి కస్తూరి ప్రశంసల జల్లు కురిపించింది. రాహుల్ ధైర్యం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొంది. ప్రస్తుతం ‘XY XX’ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న కెఎల్ రాహుల్.. ఇటీవల కేఎల్ రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఇదే విషయం ఇప్పుడు కస్తూరిని ఆకట్టుకుంది. సాధారణంగా క్రికెటర్లు ఇలాంటి యాడ్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ రాహుల్ మాత్రం అండర్ వేర్ కంపెనీకి ప్రచారకర్తగా ఉంటూ కొత్త సంప్రదాయానికి తెరదీసాడంటూ’ కేఎల్ రాహుల్‌ను అభినందిస్తూ కస్తూరి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
We see cricketers plug colas ,chips & online games. Many Indian sportsmen have endorsed clothing brands, but have shied away from undergarment labels.
So it’s nice to see @klrahul looking buff in boxers.
Hope this brings menswear out of the closet. Pun intended :)) #PostIPL_Post pic.twitter.com/MFA0Glc9kt— Kasturi Shankar (@KasthuriShankar) May 30, 2022
‘క్రికెటర్లు మాములుగా కూల్ డ్రింక్స్, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ప్రముఖ దుస్తుల బ్రాండ్లకు ప్రచారం చేయడం చూస్తుంటాం. కానీ లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు మాత్రం వారు సిగ్గుపడుతుంటారు. కానీ రాహుల్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా అండర్ వేర్స్ యాడ్ చేశాడు. రాహుల్‌ను ఈ బాక్సర్లలో చూడటం చాలా బాగుంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను..’ అని నటి కస్తూరి రాసుకొచ్చింది. మరి.. నటి ‘కస్తూరి’ ఎంతో ధైర్యంగా ఈ విషయాన్ని మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nora Fatehi: బాహుబలి భామపై నెట్టింట ట్రోలింగ్! బుద్ది లేదా అంటూ రెచ్చిపోయారు!