బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ .. టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. ఎప్పుడు వివాదాలతో వార్తలో ఉండే కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లడటంలోనూ, ఫ్యాషన్ విషయంలోనూ కంగనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతటి స్టార్ హీరోపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనాకు సాటి ఎవరు రారు. మరి ఇలాంటి ఫైర్ బ్రాండ్ మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. కంగనా ఎందుకు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. మరి.. ఆ సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయం బయట కంగనా మీడియాతో మాట్లాడుతూ.. “శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని, దర్శనం విషయంలో సహయం చేసినందుకు హీరో విష్టుకు, టీటీడీ ఏవీ ధర్మారెడ్డికి థ్యాంక్స్” అని తెలిపారు.
ఇదీ చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!
దర్శన సమయంలో కంగనా రనౌత్ వెంట ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్, ఆయన సతీమణి కృష్ణ ఉన్నారు. మే 20న ‘ధాకడ్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు ధాకడ్ మూవీ టీమ్ తెలిపింది. అయితే ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్ తో కనిపించే కంగనా.. తిరుమలలో మాత్రం ఎరుపురంగు చీర, నుదుటన బొట్టుతో సాంప్రదాయంగా దర్శనమిచ్చారు. ఈక్రమంలో ఆమెను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. మరి.. మంచు విష్ణుకు.. కంగనా థ్యాంక్స్ చెప్పండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.