సీనియర్ నటి కాంచన గుర్తుండే ఉంటారు. అందంతో పాటు నటనతోనూ అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అలాంటి ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కాంచన ఏమన్నారంటే..!
అలనాటి కథనాయికల్లో కాంచన చాలా ప్రత్యేకమనే చెప్పాలి. తనదైన శైలిలో అద్భుతంగా నటిస్తూ ఎందరో ప్రేక్షకుల హృదయాలను ఆమె గెల్చుకున్నారు. అప్పటి స్టార్ హీరోలతో జోడీ కట్టి అగ్రనాయికగా దూసుకుపోయారు. అందంతో పాటు మంచి మనసున్న నటిగా కాంచనకు పేరుంది. వయసు సహకరించకున్నా ఇప్పటికీ ఆమె అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి సూపర్ స్టార్లతో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు కాంచన. అలాంటి ఆమెను సొంత తల్లిదండ్రులే విషం పెట్టి చంపాలనుకున్నారు. దీంతో ఆమె అందర్నీ కాదని, ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు. సినిమాల్లో నటించడం ద్వారా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు కాంచన.
కాంచన తల్లిదండ్రులు ఆమెను మోసం చేశారు. సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన ఆస్తుల్లో నుంచి కూతురికి వాళ్లు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో పేరెంట్స్‌పై కాంచన కేసు వేశారు. అన్నీ పోగా కొంతమేర ఆస్తిని ఆమె దక్కించుకున్నారు. అయితే ఆ ఆస్తి కూడా వద్దనుకుని దాన్ని ఓ గుడికి రాసిచ్చారాట. ప్రస్తుతం అదే ఆలయంలో దైవ సేవ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు కాంచన. ఇదిలాఉండగా, ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచన సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి తనను అవమానించారని ఆమె అన్నారు. ‘బాహుబలి’ సినిమా కోసం తనను రెండ్రోజుల డేట్స్ అడిగారన్న కాంచన.. రూ.5 లక్షల పారితోషికం అడిగితే అంత ఇవ్వలేమని తనను వద్దనుకున్నారని తెలిపారు.
తన లాంటి ఒక సీనియర్ నటికి రూ.5 లక్షలు ఇవ్వలేని స్థితిలో రాజమౌళి లేరు కదా అని కాంచన ప్రశ్నించారు. ఆ డబ్బు వారికి పెద్ద విషయమే కాదని.. తన లాంటి వారికి ఇస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుందని కాంచన చెప్పారు. కాంచన వ్యాఖ్యలు రాజమౌళి వరకు చేరతాయో లేదో చూడాలి. ఒకవేళ ఈ కామెంట్స్ ఆయన దృష్టికి వస్తే.. దీనిపై జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే, ఆస్కార్ వేడుకలు ముగియడంతో హైదరాబాద్‌కు తిరిగొచ్చారు రాజమౌళి. వచ్చీ రాగానే తన తర్వాతి సినిమా హీరో మహేష్ బాబును కలిశారు. వీరిద్దరూ కలసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మహేష్‌తో తెరకెక్కించనున్న మూవీ పనులపై రాజమౌళి దృష్టి సారిస్తున్నారని సమాచారం. మరి.. రాజమౌళిపై సీనియర్ నటి కాంచన చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.