సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. కొందరు తక్కువ కాలంలోనే స్టార్స్ అయిపోతుంటారు. ఇంకొందరు ఏళ్లపాటు స్టార్డమ్, గుర్తింపు కోసం ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల పరిస్థితి వేరేలా ఉంటుందనే చెప్పాలి. కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో బోల్డ్ పాత్రలు చేసేవారు కొందరైతే.. అవకాశాలు రాక బోల్డ్ పాత్రలు ఒప్పుకునేవారు మరికొందరు. అయితే.. ఒక్కసారి బోల్డ్ రోల్ లో కనిపించాక ఇండస్ట్రీలో అలాంటి అవకాశాలే వస్తుంటాయని వింటుంటాం.
తాజాగా టాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి జ్యోతి.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జీవితంలో ఫేస్ చేసిన కష్టాలను తలచుకొని ఏడ్చేసింది. బోల్డ్ క్యారెక్టర్స్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న జ్యోతి.. గతంలో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే.. బిగ్ బాస్ తర్వాత నుండి చాలా ఏళ్ళు కెమెరా ముందుకు రాలేదు జ్యోతి. అటు సినిమాలకు, నటనకు దూరంగా ఉంటున్న జ్యోతిపై అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చి.. ఆమె లైఫ్ ని ఇబ్బంది పెట్టాయని అంటోంది నటి.
జీవితంలో చాలా బాధపడిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. “నాపై రూమర్స్ వచ్చినప్పుడు నేను రెంట్ హౌస్ లో ఉండేదాన్ని. అప్పుడు నాకు రెండేళ్ల బాబు ఉన్నాడు. వెంటనే ఓనర్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలనీ చెప్పేశారు. చాలా హౌసెస్ తిరిగాను.. ఎవ్వరూ నాకు రెంట్ కి ఇవ్వలేదు. ఆ టైంలో నేను రోడ్డుమీద బాబుతో కూర్చొని చాలా ఏడ్చేశాను. అదేంటీ నాకు ఎవ్వరు రెంట్ కి హౌస్ ఇవ్వట్లేదు.. నా పరిస్థితి ఇదా అనిపించి ఏడ్చేశా. ఆ ఇన్సిడెంట్ మాత్రం నేను లైఫ్ లో మర్చిపోలేను. అప్పుడే నేను ఇల్లు కొనుక్కొని, ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను.” అంటూ చెబుతూ కంటతడి పెట్టుకుంది జ్యోతి.
ప్రస్తుతం జ్యోతి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. జ్యోతి తెలుగులో హంగామా, పెళ్ళాం ఊరెళితే, ఎవడి గోల వాడిది, గుడుంబా శంకర్, మహాత్మ లాంటి ఎన్నో సినిమాలలో నటించింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో విషయాలపై ఓపెన్ అయింది జ్యోతి. ప్రేమ, పెళ్లి.. భర్తతో విభేదాలు.. విడాకులు.. ఇప్పుడు కొడుకుతో ఒంటరిగా ఉండటం.. ఇలా అన్ని విషయాల్లో ఓపెన్ అయ్యింది జ్యోతి. మరి నటి జ్యోతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.