సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతీవారు తమలో ఉన్న టాలెంట్ ను జనాలకు చూపించాలని అనుకుంటారు. ఆ క్రమంలో వారు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతారు. ఎన్నో చీత్కారాలను భరిస్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజు తమకంటూ ఛాన్స్ వస్తుందని చిన్న ఆశ. అలానే ఇండస్ట్రీకి వచ్చారు సీనియర్ నటి జయవాణి. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
”అరేయ్ సత్తిగా.. పిల్లల మీదేంట్రా నీ ప్రతాపం..”అనే డైలాగ్ గుర్తుందిగా. ఆడైలాగ్ చెప్పింది ఎవరో కాదు. నటి జయవాణి.. యమదొంగ, మర్యాద రామన్నా, విక్రమార్కుడు, గుంటూర్ టాకీస్ వంటి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నావని చాలా మంది అవమానించారని ఆమె చెప్పారు. నటిగా పనికిరావని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు జయవాణి వివరించింది.
జయవాణి మరిన్ని వివరాలపై స్పందిస్తూ..”అప్పట్లో నా పేరు అందరికీ తెలియాలని బోల్డ్ పాత్రలు చేశా. ఇప్పుడు నాకు అంత అవసరం లేదు. ప్రస్తుతం జయవాణి అంటే అందరికీ తెలుసు. గుర్తింపు కోసమే అలాంటి సినిమాలు చేశా. ఆ క్యారెక్టర్లు చేసినంత మాత్రనా అందరూ అలా ఉండరు. విలన్ పాత్రలు చేసిన వారు బయట అలానే ఉండరు కదా” అంటూ చెప్పుకొచ్చింది.
సినిమా అవకాశం ఉందని ఫొటో షూట్ తీసి ఇంటర్‌నెట్‌లో పెట్టి మోసం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు జయవాణి. ‘మూవీ ఛాన్స్ కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేస్తే ఓ ఆఫీస్‌కు వెళ్లానని.. ఓ డ్రెస్‌లో తన ఫొటోలు తీసుకున్నారని చెప్పారు. వాళ్లు కొన్ని ఫొటోలు తీసుకున్న తరువాత అక్కడి నుంచి వచ్చానని.. మళ్లీ వాళ్లు తనకు ఇప్పటి వరకు కాల్ చేయలేదన్నారు. కానీ కొద్ది రోజులకు ఆ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెట్టారని బాధ పడింది. ఆరా తీద్దామని వెళితే అక్కడ ఎవరూ లేరన్నారు. ఇండస్ట్రీలో జయవాణి పడ్డ కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సీతా రామం హిందీ హక్కులు కొన్న RRR నిర్మాతలు!
ఇదీ చదవండి: ఆమీర్ ఖాన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారు: విజయశాంతి