టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు మల్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పిటికే చాలా మంది మంచి కథలను ఎంచుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. స్టార్ హీరోయిన్ ఇంద్రజ కూడా శతమానం భవతి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి బుల్లితెరలో జడ్జిగా అలరిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలోనే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అది కూడా అల్లు అర్జున్– సుకుమార్ కాంబో పుష్ప-2 సినిమాలో అని సమాచారం.
ఇదీ చదవండి: వీడియో: వెండితెరపై పునీత్ ను చివరిసారి చూస్తూ ఏడ్చేస్తున్న అభిమానులు!
పుష్ప సినిమా దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన హీట్ ఏ రేంజ్ లో ఉందో అందరూ చూశారు. ఎక్కడ చూసిన శ్రీవల్లి స్టెప్పులు, తగ్గేదేలే డైలాగులు. సెలబ్రిటీలు, క్రికెటర్లే కాదు ఆఖరికి రాజకీయ నాయకులు సైతం పుష్ప సినిమా డైలాగులే చెప్పేశారు. అంతటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఇంద్రజకు అవకాశం వస్తే ఆవిడ రేంజ్ నిజంగానే మారిపోతుంది. ఆ రోల్ కోసం స్వయంగా సుకుమార్ ఇంద్రజను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. సుకుమార్ సినిమా కాబట్టి మినమ్ ఎక్స్ పెక్ట్ చేయచ్చనే అంచనాకు వచ్చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల కానుంది. పుష్పు-2 సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.