సుడిగాలి సుధీర్.. ఒక మెజీషియన్, డాన్సర్, యాంకర్, నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. బుల్లితెర నుంచి అటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోగా స్థిరపడిపోయే అవకాశం కూడా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అతనికి అంత నేమ్, ఫేమ్ తెచ్చిన జబర్దస్త్ కు సుధీర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోల నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఎందుకు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేశాడు అనేది అతని ఫ్యాన్స్, ప్రేక్షకులకు మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.
సుధీర్ ఎంతో అభిమానంగా అమ్మా అని పిలుచుకునే జడ్జి ఇంద్రజ సుమన్ టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సుధీర్ కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుధీర్ లేకపోవడం వల్ల రేటింగ్స్ ఏమైనా తగ్గాయా? సుడిగాలి సుధీర్ అసలు జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? సుధీర్‌తో ఇంద్రజకున్న అనుబంధం ఎలాంటిది? అనే పలు ఆసక్తికర ప్రశ్నలకు ఇంద్రజ సూటిగా సమాధానం చెప్పారు. ఆ పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి. సుధీర్ గురించి ఇంద్రజ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.