ఈ మద్య కొంత మంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ అందచందాలతో కుర్రాల మనసు దోచుకోవడమే కాదు.. తమ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు. ఇలాంటి ఫోటోలతో దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హాలీవుడ్ నటి హిలరీ డఫ్ న్యూడ్ ఫొటో షూట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్ కవర్‌పై నగ్నంగా కనిపించిన ఆమె ఈ సందర్భంగా బాడీ ఇమేజ్ విషయం గురించి చర్చించింది.
ఇది కూడా చదవండి: Kurnool: కర్నూలు జిల్లాలోని ఆ ప్రాంతంలో పాలు ఉచితంగా ఇస్తారు, అమ్మరు!
‘నేను నా శరీరం గురించి గర్వపడుతున్నా. ఇది నాకు ముగ్గురు పిల్లలను అందించినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. నా బాడీలో వచ్చిన మార్పులతో ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి చేరుకున్నా’ అని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోలు షూట్ చేసిన ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకులకు థాంక్స్ చెప్పింది. తన బాడీని ఇంత అందంగా చూపించిన మేకప్ ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేసింది. అంతేకాదు టాటూస్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్త పరిచిన ఆమె మొదట ఫొటో షూట్ భయంగా అనిపించినా చివరికి అందంగా, ఆనందంగా ముగిసిందని తెలిపింది.
ఇది చదవండి: ఆ ప్యాలెస్‌లో దెయ్యం ఉంది.. మా అమ్మ దానితో మాట్లాడింది: ట్వింకిల్ ఖన్నా
నటి హిలరీ డఫ్ కి సంబంధింని ఫోటో చూసి కొంత మంది నెటిజన్లు ఫైర్ ఎమోజీ పోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది ఆమె అందాన్ని పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఫొటోలను బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా లైక్ చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.