విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వాడకం వల్ల నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ కష్టం ఎక్కువగా వచ్చేది సెలబ్రిటీలకే. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ నటి హేమ. మరి ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయించారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సెలబ్రిటీలకు చెందిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు అభిమానులు. ఇక ప్రస్తుత సోషల్ మీడియాల యుగంలో సెలబ్రిటీలకు మరింతగా దగ్గరయ్యే అవకాశం కూడా వారికి దొరికింది. అయితే విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వాడకం వల్ల నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ కష్టం ఎక్కువగా వచ్చేది సెలబ్రిటీలకే. దాంతో వారు తమపై వచ్చిన అసత్య ఆరోపణలను, వార్తలను ఖండించే క్రమంలో ఆ న్యూస్ ను పోస్ట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ నటి హేమ. మరి నటి హేమ పోలీసు స్టేషన్ కు ఎందుకు వెళ్లింది? కారణం ఏంటీ? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నటి హేమ.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకుంది. తన నటనతో, అందంతో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. దుసుకెళ్తోంది. వయసు పెరుగుతున్నా గానీ, వన్నె తగ్గని అందంతో.. కుర్రాళ్ల కలల రాణిగా ఉంది. ఇక ఎప్పుడు ఏదో ఒక వివాదంతో తరచుగా వివాదంలో నిలుస్తుంటారు ఆమె. ఇక ఇటీవలే తన భర్తతో కలిసి మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంది హేమ. ఇక ఈ పార్టీకి తన స్నేహితులతో పాటుగా ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రవీంద్ర, సురేఖ వాణి, రజిత, తనీష్ లతో పాటుగా మరికొంత మంది ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు.
ఇక ఈ పార్టీలో స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేసింది ఈ జంట. ఈ సందర్భంగా తన భర్తకు లిప్ లాక్ ఇచ్చారు హేమ. ఈ ఫోటోను, వీడియోను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అభ్యంతరకర థంబ్ నెయిల్స్ తో పబ్లిష్ చేశారు అని తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు హేమ. తన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆ వీడియోలను నీచమైన థంబ్ నైయిల్స్ తో వాడుతున్నారు అని ఈ ఫిర్యాదు లో పేర్కొన్నారు. అదీకాక తన భర్త చనిపోయాడని, డైవర్స్ తీసుకున్నారు అంటూ నీచమైన వార్తలను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయంటూ.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ మరణించారన్నఫేక్ న్యూస్ తాజాగా హల్ చల్ చేసింది. దాంతో స్వయంగా కోటా శ్రీనివాస్ ఓ వీడియో ద్వారా నేను బతికేఉన్నాను అంటూ అభిమానులకు తెలిపాడు. ఇలాంటి తప్పుడు వార్తల ప్రసారాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి తప్పుడు వార్తలు ప్రసారం చేసే ఛానల్స్ పై నటి హేమ చేసిన ఫిర్యాదుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.