సినీ ఇండస్ట్రీలో సింగిల్స్ గా ఉన్న హీరో హీరోయిన్స్ అందరూ ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. రీసెంట్ గా హీరో నాగశౌర్య, హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోయిన్ హరిప్రియ కూడా పెళ్లి వార్త చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం సహనటుడితో గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ చేసిన హరిప్రియ.. ఇటీవల తన ప్రియుడితో పాటు ఎయిర్ పోర్టులో కనిపించి.. ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ తో పెళ్లి కబురు ఖరారు చేసింది. ఇంతకీ హరిప్రియ పెళ్లాడబోయే సహనటుడు ఎవరో కాదు.. వశిష్ట సింహా. కేజీఎఫ్ లో కమల్ గా, నారప్పలో శీన క్యారెక్టర్స్ లో వశిష్ఠ సింహా నటించాడు.
ఇక కొన్నాళ్లుగా ప్రేమలో ఉంటూనే సైలెంట్ గా పెళ్లికి రెడీ అయిపోయిన వీరి లవ్ స్టోరీ తెలుసుకోవాలని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కాగా.. హీరోయిన్ హరిప్రియ తాజాగా వశిష్ఠ సింహతో లవ్ స్టోరీ ఎలా మొదలైంది? అనే విషయాన్ని బయటపెట్టింది. ఎప్పటినుండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న హరిప్రియ – వశిష్ఠ ఓ పెంపుడు కుక్క కారణంగా ప్రేమలో పడ్డామని చెబుతున్నారు. హరిప్రియ మాట్లాడుతూ.. “నా దగ్గర లక్కీ, హ్యాపీ అని రెండు కుక్కపిల్లలు ఉన్నాయి. వాటిలో లక్కీ అనే కుక్కపిల్ల చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరి అయ్యింది. ఆ టైమ్ లో వశిష్ఠ.. క్రిస్టల్ అనే కుక్కపిల్లను నాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పటినుండి హ్యాపీ – క్రిస్టల్ రెండూ మంచి ఫ్రెండ్స్ అయ్యాయి.
ఈ క్రమంలో క్రిస్టల్ ని బహుమతిగా ఇచ్చినప్పుడు దాని పొట్టపై ఓ మచ్చ ఉంది. ఇన్నాళ్లు ఆ మచ్చ పెరుగుతున్నట్టుగా నాకు, వశిష్ఠకి మధ్య ప్రేమ పెరుగుతూ వచ్చింది. అలా మా లవ్ కి కుక్కపిల్ల కారణమైంది” అని ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి లవ్ మ్యారేజ్ టాపిక్ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. హరిప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తకిట తకిట సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పిల్ల జమీందార్, అబ్బాయ్ క్లాస్ అమ్మాయి మాస్, జై సింహ, బెల్ బాటమ్ లాంటి మూవీస్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కాగా, వీరిద్దరూ వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.