సోషల్ మీడియా వచ్చాక ఒక్క రాత్రిలోనే స్టార్ అయిపోతున్నారు కొంత మంది. ఇక సినితారల విషయనికి వస్తే తాము చేసే ఏ చిన్నపని అయినా తమ బ్లాగ్ లలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ వేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
హరితేజ.. ‘అఆ’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ షోకి వచ్చాక హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ షో తెలుగు మొదటి సీజన్‌లో హరితేజ అందరినీ ఎంటర్టైన్ చేసింది. తన కామెడీ టైమింగ్, డ్యాన్సులు, హరికథలు చెప్పడం వంటివి చేస్తూ అందరినీ అలరించేసింది. అలా మొత్తానికి బిగ్ బాస్ తరువాత ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం బెల్జియం వెకేషన్ టూర్ లో ఉన్న హరితేజ అక్కడ తెగ ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అక్కడి నడి వీధుల్లో పొట్టి గౌను వేసుకుని చిందులు వేసింది. తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. దీనిపై నెటిజన్లు భగ్గుమన్నారు. ఆ డ్రెస్సేంటి? ఆ డ్యాన్స్ ఏంటి? అంటూ కామెంట్స్ చేయగా, దీనిపై హరితేజ స్పందించింది. ముందు నా డ్రెస్ మీద ఫోకస్ తగ్గించి.. నా డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయండి అని హరితేజ చెప్పుకొచ్చింది. మరి హరితేజ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rana: కోర్టుకు హాజరైన హీరో రానా! కేసు ఏమిటంటే?
ఇదీ చదవండి: మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ ప్రణీత..!