సినిమా ఇండస్ట్రీలోనూ మనుషుల్ని పోలిన మనుషులు ఉండనే ఉన్నారు. తాజాగా, ఓ యువ నటి అచ్చం సమంతలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉండటం సహజం. మనలా ఈ సృష్టిలో ఏడు మంది ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా హీరోలా.. హీరోయిన్స్‌లా బయటి వ్యక్తులు కనిపించటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలోనూ హీరోలు, హీరోయిన్లను పోలిన నటీ, నటులు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లను పోలిన నటీమణులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు యువ నటిని సమంతలా ఉందంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఎవరా నటి అంటే.. మెయిల్ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గౌరిప్రియా రెడ్డి.
ఈమె ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో ఇంకోమెట్టు పైకి ఎదిగారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. గౌరిప్రియ అచ్చం సమంతలా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ జూనియర్ సమంత’.. ‘‘సమంతలా ఉన్న ఫ్యామిలీమ్యాన్ రాజీ’’.. ‘‘ నాకు మాత్రమే సమంతలా కనిపిస్తోందని అనుకుంటూ ఉంటున్నాను’’.. ‘‘నటి గౌరిప్రియ ఫ్యాన్స్ క్లబ్ ఎక్కడరా.. లేదంటే మనమే స్టార్ట్ చేద్దాం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, గౌరి ప్రియ ప్రస్తుతం ‘మోడ్రన్ లవ్ చెన్నై ’ సిరీస్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మే 18నుంచి అందుబాటులోకి వచ్చింది. సూపర్ డీలక్స్ ఫేమ్ త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రముఖ మీడియాలు కూడా మంచి రివ్యూలు ఇచ్చాయి. మరి, గౌరిప్రియ రెడ్డి సమంతా ఉందంటూ నెటిజన్లు పొగడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kutty Samantha 🥰😍 pic.twitter.com/EPJqx5elav
— ΛB (@A_forAbii) May 19, 2023