నెటిజన్ అడిగిన ప్రశ్న నటి ఫాతిమా బాబును ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. అతడికి ఘాటు రిప్లై ఇచ్చారు. తర్వాత వాటిని స్క్రీన్ షాట్లు తీశారు.
ఫాతిమా బాబు.. ఈ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈమె తెలుగులో కొన్ని సీరియళ్లు.. రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. నవదీప్ హీరోగా వచ్చిన ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’ సినిమాలో అతడికి తల్లిగా నటించారు. ఆ తర్వాత ఆమె రజినీకాంత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘కథానాయకుడు’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో క్రిస్టియన్ సిస్టర్ పాత్రలో కనిపించారు. తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ, తమిళ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే ఆమె చేతిలో ఏ సినిమాలు లేవు.
ప్రస్తుతం సీరియళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక, ఫాతిమా బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. ఓ నెటిజన్ తప్పుడు ప్రశ్నలు వేసి తనను ఇబ్బంది పెట్టాడని ఆమె పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫాతిమా బాబు కొన్నేళ్ల క్రితం ఓ హిందువును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ ఇద్దరికీ ఆమె ముస్లిం పేర్లను పెట్టారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ఆమెను అడిగాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది.
ఆమె స్పందిస్తూ.. ‘‘ మీరు మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎలాంటి కండోమ్ వాడతామో కూడా అడుగుతారా? మీరు చర్చించుకోవటానికి మా పర్సనల్ విషయాలే దొరికాయా? ప్రతీ దానికి ఓ హద్దు ఉంటుంది. అవతలి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా మాట్లాడాలి’’ అని పేర్కొన్నారు. కొంతమంది నెటిజన్లు ఫాతిమా బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మరి, తనను తప్పుడు ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టిన నెటిజన్‌కు ఫాతిమా బాబు దిమ్మతిరిగే రిప్లై ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.