సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోల్లో చూసినట్లయితే అసలు గుర్తుపట్టలేనంతగా ఉంటారు హీరో హీరోయిన్లు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి.. వారి ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిన్నతనంలో స్కూల్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ.. ఎంతో క్యూట్ ఉంది. ఇప్పుడు తన అందాలతో కుర్రకారు మతిపొగొట్టేస్తుంది. ఆ హీరోయిన్ ని మీరు గుర్తు పట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అందాల భామ ఫరియా అబ్ధుల్లా. జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు ఈ బ్యూటీ పరిచయమైంది. ఇందులో అమాయకురాలైన చిట్టి పాత్రలో నటించిన ఫరియా యువ హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టితో జోడి కట్టిన ఈ భామ.. థియేటర్లో నవ్వులు పూయించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాదీ అమ్మాయి పాపులారిటీ పెరిగింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలో కనిపించింది.
తన అందంతోనే కాకుండా కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఫరియా. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసింది ఈ భామ. అలానే మరో ఐటెమ్ సాంగ్ లో మెరవనున్నట్లు సమాచారం. అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాలో ఐటెం సాంగ్ ఫరియా అబ్దుల్లా చేస్తోందని టాక్. జాతిరత్నాలు సినిమాలో ఈ అమ్మడి నటనకు ప్రభాస్ లాంటి అగ్ర స్టార్ హిరో చేత ప్రశంసలు అందుకుంది. దీంతో ఇక ఈ బ్యూటీ తిరుగేలేదని అనుకున్నారంతా.
కానీ ఊహించిన దానికి భిన్నంగా ఆమె కెరీర్ సాగిపోతోంది. ప్రస్తుతం “లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శోభన్, ఫరియా హీరో,హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఫరియా కెరీర్‌కి మంచి బూస్టింగ్ అవుతుందని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.