సినిమా అంటే రంగుల ప్రపంచం. కానీ.., ఇక్కడ కంటికి కనిపించని చీకటి కోణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకి ఎదురయ్యే దారుణమైన ఘటనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు, మీ టూ ఉద్యమం సినీ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేశాయి. ఇంత జరిగినా.. పరిశ్రమలో మార్పు రావడం లేదు. ఈ విషయాన్ని నిజం చేస్తూ హీరోయిన్ ఎస్తేర్ కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది.
హీరోయిన్ ఎస్తేర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ర్యాప్ సింగర్ నోయల్ మాజీ భార్యే ఈ ఎస్తేర్. గతంలో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన ఆర్నెళ్లకే ఈ జంట విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చారు. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎస్తేర్ తెలుగులో భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇవే కాక కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించింది. అయితే.., ఎస్తేర్ తాజాగా టాలీవుడ్ తెరవెనుక బాగోతాన్ని బయటపెట్టింది.
“ఇక్కడ ఇండస్ట్రీ అంతా మంచిగా ఉండదు. మేనేజర్స్ కళ్లన్నీ హీరోయిన్స్ మీదే ఉంటాయి. కాంప్రమైజ్ కు సిద్ధమయ్యేలా మెంటల్ గా మనల్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రాసెస్ లో కెరీర్ నాశనం చేస్తామని, ఆఫర్స్ రాకుండా చేస్తామని భయపెడుతారు. మీరు ఇలాగే ఉంటే కెరియర్‌లో ముందుకు వెళ్లలేరు.. వాళ్లు చెప్పినట్టు వినాలి.. వాళ్ల దగ్గరకు వెళ్లాలి అంటూ నన్ను కూడా మార్చే ప్రయత్నం చేశారు. కానీ.., నేను ఆ ఆఫర్స్ కి, బెదిరింపులకి లొంగలేదు. క్యారెక్టర్ చంపుకుంటే వచ్చే పేరు, హోదా, అవకాశాలు నాకు వద్దు అనుకున్నాను’’ అంటూ ఎస్తేర్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. చూశారు కదా..? ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ అయ్యిండి కూడా ఎస్తేర్ ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో! ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.