ప్రముఖ నటి దివ్య గణేష్ తన జీవితంలో ఎదురైన ఓ దారుణమైన లైంగిక వేధింపుల ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా తాను ఎలా రియాక్ట్ అయిందో కూడా చెప్పుకొచ్చారు.
దివ్య గణేష్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాను, తమిళ సీరియల్స్‌ను ఫాలో అయ్యేవారికి మాత్రం ఈమె గురించి బాగా తెలుసుంటుంది. సూపర్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న పలు సీరియల్స్‌తో ఆమె భాగమయ్యారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఈమె 2015లో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. కెలాడీ కన్‌మణీ అనే సీరియల్‌తో బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆమె లక్ష్మీ వందాచు, భాగ్య లక్ష్మి వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించారు. తమిళనాట వ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సీరియల్స్‌లోనే కాదు పలు సినిమాల్లో కూడా నటించారు.
తాజాగా, ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చారు. దివ్య మాట్లాడుతూ.. ‘‘ నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాను. అది చాలా పెద్ద విమానం. లోపల ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. నేను చివర్లో కూర్చుని నిద్రపోతూ ఉన్నాను. నా నడుము దగ్గర ఏదో తగులుతున్నట్లు నాకు అనిపించింది. మొదట నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. పదే పదే అలా అవుతుంటే ఏంటా అని చూశాను.
నా వెనకాల కూర్చున్న వ్యక్తి నా నడుమును తడుముతూ ఉన్నాడు. మొదట నేను ఏదైనా పురుగు అనుకున్నాను. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యాను. వెంటనే పైకి లేచాను. కోపంతో అతడి చెంపపై నాలుగు సార్లు కొట్టాను. మహిళల పట్ల జరిగే ఇలాంటి విషయాలపై కచ్చితంగా సీరియస్‌గా ఉండాలి. భయపడకూడదు. ఇలాంటి విషయాల్లో మీడియా కూడా ఆడవాళ్లను తప్పుబడుతోంది. ఉన్నది ఒకటి, అక్కడ రాసేది ఒకటి ఉంటోంది ’’ అని అన్నారు. మరి, మహిళలపై తరచుగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.