సాధారణంగా సినీ, బుల్లితెరపై నటిగా ప్రస్థానం మొదలు పెట్టి మంచి నటీగా గుర్తింపు పొందిన వారు.. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దూరమవుతున్నారు.
సినిమా, బుల్లితెరపై తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కొంతమంది నటీమణులు వివాహానంతరం నటనకు గడ్ బై చెప్పెస్తున్నారు. మరికొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. తాజాగా హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ -12 విజేత ప్రముఖ బుల్లితెర నటి దీపికా కక్కర్ (ఫైజా). ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీ అని.. తన కుటుంబానికి, పుట్టబోయే బిడ్డకు కోసం సమయాన్ని కేటాయించడం కోసం నటనకు గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ బుల్లితెర నటి దీపికా కక్కర్ మొదట జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఎయిర్ హూస్టెస్ గా మూడేళ్లు పనిచేసింది. అనారోగ్యం కారణం తో ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.. దానితోపాటు యాక్టింగ్ కెరీర్ పై దృష్టి పెట్టింది. బాలీవుడ్ పాపులర్ సీరియల్ ‘ససురాల్ సిమర్ కా’ తో నటిగా దీపికా కక్కర్ మంచి ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత పలు రియాల్టీ షోలో పాల్గొంది. బాలీవుడ్ మూవీ ‘పల్టాన్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తన సహనటుడు షోయబ్ ఇబ్రహీంని ప్రేమించి 2018లో పెళ్లి చేసుకుంది. షోయబ్ ముస్లిం కావడంతో దీపిక కూడా ఆ మతంలోకి మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తనపేరు ఫైజా గా మార్చుకుంది.
ఈ సందర్భంగా దీపికా కక్కర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను గర్భవతిని.. తల్లిని కాబోతున్న ఫీలింగ్ ఎంతో సంతోషాన్నిస్తుంది.. పెళ్లైన ఐదేళ్ల తర్వాత మేము పేరెంట్స్ కాబోతున్నాం.. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను.. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు మేకప్ వేసుకున్నాను.. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగాను. నా ప్రెగ్నెన్సీ గురించి నా భర్త షోయబ్ కి చెప్పిన తర్వాత ఆయన కళ్లలో ఆనందం వేరే లెవల్.. నాకు పనిచేయడం ఇష్టం లేదు.. నటనకు గుడ్ బై చెప్పి.. ఒక తల్లిగా, భార్యగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.