గ్లామర్ ప్రపంచంలో పరిచయాలు.. ప్రేమలుగాను, ప్రేమలు.. పెళ్లిళ్లుగాను మారుతున్న సందర్భాలు అనేకం. ఎవరకి తెలియకుండా ప్రేమను గోప్యాంగా ఉంచడం, ఆ తర్వాత పెళ్లిపీటలెక్కడం కామన్ అయిపోయింది. తాజాగా అలాంటి జంటల్లోకి మరొకరు వచ్చి చేరారు. బుల్లితెర నటి దీపా జగదీష్, శాండిల్ వుడ్ దర్శకుడిని పెళ్లాడింది. వీరి వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కన్నడ, తెలుగు సీరియల్స్‌తో నటి దీపా జగదీష్ బాగానే పాపులర్ అయ్యింది. 2018లో ప్రీతి కేళి స్నేహ కలేడుకొల్లబెది చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన.. దీపా జగదీష్ తెలుగు సీరియల్ ప్రేమ నగర్‌లో నటించింది. బుధవార దీపా జగదీష్, శాండిల్ వుడ్ దర్శకుడు సాగర్ పురానిక్ ను పెళ్లాడింది. ఈ అమ్మడు ఈ మధ్యనే బ్యాచులర్ పార్టీని సైతం గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇది చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: నా బర్త్ డే.. నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా! అడగడానికి మీరు ఎవరు? : ఐరా ఖాన్