ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. ఇలా అభిమాన సెలబ్రిటీల ఇంట విషాదాలు చోటు చేసుకోవడంతో సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, పొలిటిషన్ దేబాశ్రీ రాయ్ తల్లి ఆరతీ రాయ్ కన్నుమూశారు. ఈమె బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి స్వయానా అమ్మమ్మ అవుతుంది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ అమ్మమ్మ అరతీ రాయ్.. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. అరతీ రాయ్ వయసు 92 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు.. దేబశ్రీ, పూర్ణిమ, కృష్ణ. 2022లో ఆమెకు ఒక ప్రమాదంలో గాయాలు కావడంతో పెద్ద కూతురు వద్దనే ఉంటుంది. నటిగా దేబాశ్రీ వందకు పైగా చిత్రాల్లో నటించి పలు అవార్డులు గెల్చుకున్నారు.
ఇక అరతీ రాయ్ చనిపోయే ముందు ఆమె ముగ్గురు కూతుళ్లు ఆమె వద్దనే ఉన్నారని.. నవంబర్ 8న ఆమె ప్రశాంతమైన మరణం పొందిందని నటి దేబశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా దేబాశ్రీ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి.. నటిగా నా కల సాకారం చేసుకోవడానికి నా తల్లి ఎంతో సహకరించారు. నేను ఇండస్ట్రీలో.. ఇతర రంగాల్లో ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం నా తల్లి” అని అన్నారు. ఇక ఆరతి రాయ్ మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు దేబాశ్రీ, రాణి ముఖర్జీల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.