ఈ ముద్దు గుమ్మ తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అక్కడ కూడా తన సత్తా చాటారు. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాల్లో ఈమె నటించారు.
ఈ మధ్యకాలంలో ఎంతోమంది హీరోయిన్లు రెండు, మూడు సినిమాల్లో నటించి.. తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఇంకా మరికొంతమంది ఒకే భాషకు పరిమితం కాకుండా.. ఇతర భాషల్లోకి వెళ్లి అక్కడ అందం, అభినయంతో స్టార్‌లుగా రానిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం స్టార్‌లుగా రాణించడం అనేదా చాలా కష్టం. కానీ, పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా చేసి తన సత్తా చాటారు.
బాలీవుడ్‌లో స్టార్‌గా ఉన్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు. పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి మరెవరో కాదండి. కేరళ కుట్టీ ఆసిన్. ఈ అందాల ముద్దుగుమ్మ ఎనిమిది భాషల్లో మాట్లాడుతుంది. తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. ఆసిన్ 15 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె 2003లో వచ్చిన ‘అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ సినిమా రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన ‘ఎం. కుమరన్ సన్ ఆఫ్ మహాలక్షీ’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో శివమణి, లక్ష్మీ నరసింహా, చక్రం, అన్నవరం వంటి సినిమాల్లో నటించారు. సూర్య హీరోగా 2008లో వచ్చిన గజిని సినిమాతో ఈ అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాతి కాలంలో హిందీలోకి అడుగుపెట్టింది. గజినీ సినిమా రీమేక్‌తో స్టార్ హీరోయిన్ అయింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే అక్షయ్ కుమార్ ఫ్రెండ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక, అప్పటినుంచి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.