సామాన్య ప్రజల జీవితాల్లో మాదిరిగానే సినిమా వాళ్ల జీవితాల్లోను గొడవలు ఉంటాయి. అయితే అవి తీవ్ర రూపం దాల్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఆ సమయంలోనే కొన్ని సెలబ్రిటీ జంటలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. అలానే తాము పడిన కష్టాలను చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఒకరు.. తనకు అద్దెకు ఇల్లు దొరకడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దంపతుల జీవితాల్లో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొన్ని గొడవలు పెద్దగా మారి..విడాకలు వరకు వెళ్తుంటాయి. ఇలాంటి ఘటనలు సినిమా వాళ్ల జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీ జంటల గొడవలు, ఘర్షణ ఘటనలు అనేకం చూశాం. విడిపోయిన తరువాత కూడా కొన్ని జంటల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి జంటల్లో రాజీవ్ సేన్- నటి చారు అసోపా లు ఒకరు. కొంతకాలం క్రితం వారు విడిపోయిన సంగతి తెలిసిందే. అయినా తరచూ ఈ ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా చారు అసోపా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.
విశ్వసుందరి సుష్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సోదరుడే రాజీవ్ సేన్. కొన్నాళ్ల నుంచి అతడు, నటి చారు అసోపాలు విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. విడిపోయిన ఈ జంట గత కొంతకాలంగా ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటున్నారు. రాజీవ్ చిత్ర హింసలు పెట్టాడని, ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనూ చిత్ర హింసలకు గురి చేసేవాడని భర్తపై చారు ఆరోపణలు చేసింది. ఆమె చెప్పేవన్ని అబ్ధదాలని, మరో నటుడితో ఆమె సన్నిహితంగా ఉంటూ నన్ను మోసం చేసిందని ఎదురు దాడి చేశాడు. ఇలా వీరిద్దరి మధ్య గొడవలు తీవ్ర స్థాయిలోకి చేరడంతో తన కుమార్తెను తీసుకుని చారు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
అయితే ఆ సమయంలో తనకు ఉండటానికి ఇల్లు దొరకడమే చాలా కష్టమైపోయిందటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వూల్లో పాల్గొన్న చారు.. తనకు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకుంది. ఇంటికి కోసం ఆమె పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్తూ బాధపడింది. తాను ప్రస్తుతం ఉంటున్న 1బీహెచ్ కే నుంచి 2బీహెచ్ కేకు మారాలనుకున్నాని, ఇందుకోసం ఎప్పటి నుంచో అద్దె ఇల్లు వెతకడం ప్రారంభించానని ఆమె తెలిపారు. అయితే ముంబైలో ఇల్లు దొరకడం అంత ఈజీ కాదని, ఇప్పటికీ మండుడెంటలో అద్దె ఇంటి కోసం వెతుకూతునే ఉన్నాను అని ఆమె అన్నారు. ఇల్లు వెతకడం చాలా కష్టంగా ఉందని చారు అసోపా అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ” ప్రతి రోజు ఇల్లు వెతకడమే నా పని అయింది. ఇక్కడ నాకు ఎదురువుతున్న ప్రధాన సమస్య ఏంటంటే.. మొదట నేన నటిని, అలానేసింగిల్ పేరెంట్ ను. ఈ రెండు కారణాల వల్ల నాకు అద్దెకు ఇల్లు దొరకడం లేదంటే మీరు నమ్ముతారా?. ఇలా అయితే ముంబైలో సినిమా వాళ్లకు ఇల్లెక్కడ దొరుకుతుంది?. నాకు ఓ ప్లాట్ నచ్చి.. వాళ్లను అడగ్గా.. నేను నా కూతురితో ఒంటరిగా ఉంటాననే తెలిసి తిరస్కరించారు” అంటూ చారు ఆవేదన వ్యక్తం చేసింది. మరి.. నటి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.