ఇండస్ట్రీలో హీరోల వయసు పైబడినా వారు హీరోలుగానే కంటిన్యూ అవుతుంటారు. అదే హీరోయిన్స్ విషయానికి వస్తే.. మిడిల్ ఏజ్ రాగానే పక్కన పెట్టేసి.. తల్లి, అక్క, పిన్ని, వదిన అంటూ సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం చేస్తుంటారు. పెళ్లి అయ్యిందంటే చాలు.. ఇక హీరోయిన్స్ పని అయిపోయినట్లే అంటుంటారు. వయసు విషయంలో హీరోలకు లేని రూల్స్.. హీరోయిన్స్ కే ఎందుకు? అని అంటోంది హీరోయన్ భానుశ్రీ మెహ్రా.
సినీ ఇండస్ట్రీలో హీరోల వయసు పైబడినా వారు హీరోలుగానే కంటిన్యూ అవుతుంటారు. అదే హీరోయిన్స్ విషయానికి వస్తే.. మిడిల్ ఏజ్ రాగానే పక్కన పెట్టేసి.. తల్లి, అక్క, పిన్ని, వదిన అంటూ సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం చేస్తుంటారు. పెళ్లి అయ్యిందంటే చాలు.. ఇక హీరోయిన్స్ పని అయిపోయినట్లే అంటుంటారు. వయసు విషయంలో హీరోలకు లేని రూల్స్.. హీరోయిన్స్ కే ఎందుకు? అని అంటోంది హీరోయన్ భానుశ్రీ మెహ్రా. అల్లు అర్జున్ సరసన ‘వరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ఇప్పటిదాకా తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ భాషలో కూడా మూవీస్ చేసింది. కానీ.. ఎక్కడా హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది.
ఇక చేసేదేం లేక ప్రేమించిన వ్యక్తిని 2018లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సైడ్ క్యారెక్టర్స్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తోంది. అయితే.. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేని భాను.. రీసెంట్ గా ట్విట్టర్ లో అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడని చెప్పి వార్తల్లో నిలిచింది. కట్ చేస్తే.. అదే రోజు బన్నీ ఆమెను అన్ బ్లాక్ చేశాడని మళ్లీ చెప్పింది. అలా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారిన భాను.. తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి గురించి.. వయసు విషయంలో హీరోలకు, హీరోయిన్స్ కి మధ్య చూపిస్తున్న పక్షపాతం గురించి పోస్టులు పెట్టింది. ప్రెజెంట్ భాను పెట్టిన పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
భాను పోస్ట్ చేస్తూ.. ‘వయసు పెరగడం అనేది ఇండస్ట్రీలో మేజర్ ప్రాబ్లెమ్ గా మారింది. హీరోయిన్స్ కి వయసు పెరగగానే వాళ్ళను తల్లి, వదిన అంటూ సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం చేస్తారు. కానీ.. హీరోలకు వయసు పైబడినా.. వారికి సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్ తో లవ్ సీన్స్ చేస్తుంటారు. పెళ్లి అయిపోయిందని.. వయసు పెరిగిందని ఆడవాళ్లకు మాత్రమే రూల్స్ ఎందుకు పెడతారు? ఇకనైనా ఈ ధోరణిని బ్రేక్ చేయండి. ఇండిపెండెంట్ గా.. ధైర్యంగా బ్రతికే మహిళల కథలను చెప్పండి” అంటూ.. తాను పదేళ్ల క్రితం దిగిన ఫోటోని షేర్ చేసింది. అయితే.. భాను పోస్ట్ పై నెటిజన్స్ పాజిటివ్ గాను, నెగిటివ్ గాను రెండు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మరి భాను శ్రీ మెహ్రా పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Let’s break the stereotype & tell stories of women who are strong, independent, and unapologetically themselves ! It’s time for the industry to embrace and celebrate women of all ages, shapes, and sizes. Agree ?
— Bhanushree Mehra (@IAmBhanuShree) March 24, 2023