సోమవారం భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ నటి అతియ శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వివాహం జరిగిన తర్వాత సునీల్ శెట్టి, అతని కుమారుడు అహన్ .. ఖండాలలో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి వేడుక తర్వాత మీడియా మిత్రులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కూతురి పెళ్లి వేడుక సందర్భంగా సునీల్ శెట్టి.. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. అతి కొద్ది మంది అతిథుల మధ్యలో ఈ వివాహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలానే పెళ్లిలో అతియ ధరించిన లెహంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అందరిని ఆకర్షించే అంతా ఆ డ్రెస్ లో ప్రత్యేక ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
జనవరి 23న స్టార్ క్రికెట్ కేఎల్ రాహుల్ , బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో వధువరులు సంప్రదాయా దుస్తుల్లో దర్శనమించారు. ముఖ్యం పెళ్లిలో అతియా శెట్టి లెహంగా ధరించి అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ లెహంగా విషయానికి వస్తే.. అది తయారు చేయడానికి డిజైనర్లు చాలా కష్టపడారని తెలిసింది. అతియా ధరించిన లెహంగా తయారు చేసేందుకు దాదాపు 10 వేల గంటల సమయం పట్టిందని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అతియ శెట్టి ధరించిన లెహంగా తయారీకి 416 రోజుల సమయం పట్టిందని, అట్టే దాదాపు 10 వేల గంటలు పట్టిందని ఖన్నా తెలిపారు.
అంతేకాక ఆ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ లెహంగా ను జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. అతియా చాలా చక్కగా, ఎంతో అందమైన అమ్మాయని, పెళ్లి పీటలపై ఆమె ఓ యువరాణిలా కనిపించేలా లెహంగా డిజైన్ చేశామని తెలిపారు. అతియా కోసమే ప్రత్యేకంగా ఎంతో కష్టపడి శ్రమించి ఈ లెహంగా ను డిజైన్ చేశామని ఆమె తెలిపారు. అతియాపై ఉన్న అభిమానంతో ఈ లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించామని అనామిక ఖన్నా పేర్కొన్నారు. మరి.. ఈ లెహంగా తయారీకి అన్ని వేల గంటలు పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.