తపన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్చన వేద శాస్త్రి.. నేను సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు. సూర్య, శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాల్లో నటించారు. కమలతో నా ప్రయాణం అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న అర్చన.. రీసెంట్ గా టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించారు. నటిగా సత్తా ఉన్నప్పటికీ అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ బాధపడ్డారు. క్యారెక్టర్ రోల్స్ చేయడం వల్ల మంచి మంచి అవకాశాలు కోల్పోయినట్లు ఆమె వెల్లడించారు. హీరో రవితేజలా తాను కూడా క్యారెక్టర్స్ చేస్తూ.. హీరోయిన్ గా ఎదగాలనుకున్నానని అన్నారు. అయితే హీరో అయిన తర్వాత రవితేజ క్యారెక్టర్ రోల్స్ చేయలేదని.. తాను మాత్రం హీరోయిన్ గా చేసిన తర్వాత.. చిన్న చిన్న పాత్రలు చేశానని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఇక ఇండస్ట్రీలో అమ్మాయిలని ట్రాప్ చేయాలని కొంతమంది హీరోలు ఉంటారని. మైండ్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి వీక్ గా ఉంటే.. ఆ అమ్మాయి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది జనాలు ఉంటారని ఆమె అన్నారు. అందుకే అమ్మాయిలు వీక్ అవ్వకూడదని అన్నారు. అమ్మాయిలు ఏడ్చిందని వీక్ అంటారు కానీ అది కాదు వీక్ అంటే, ఏడుపుకి, వీక్ కి సంబంధం లేదని అన్నారు. తనను కూడా వీక్ అనుకుని ఒక హీరో ట్రాప్ చేయాలని చూశాడని ఆమె అన్నారు. మనకి బాగా తెలిసిన వ్యక్తే. మరీ ఎక్కువ సక్సెస్ కలిగిన హీరో కాదు. ఆయన నాకు తెలియకుండా నా వెనకాల నీచమైన మాటలు మాట్లాడాడట.
మనుషులు చాలా సింపుల్ గా, సీదాగా ఉన్నారని అనుకుంటాం. కానీ అది కాదు, దానికి వేరే నిజం ఉంది అన్న విషయం ఈ ఇన్సిడెంట్ తో తెలిసింది. ఇది కొన్నాళ్ల క్రితం జరిగింది. సక్సెస్ ఫుల్ హీరో ఏమీ కాదు. అతనొక వంకర ఆలోచన కలిగిన వ్యక్తి. అతను అన్న మాటలకు.. వేరే అమ్మాయి అయితే చాలా బాధపడుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేని అమ్మాయి.. డబ్బు కోసమో, పని కోసమో ఆరాటపడే అమ్మాయి ఎవరి అండ ఉండదు. పడిపోయినప్పుడు బాధపడితే వెన్నుతట్టేవాళ్ళు లేరనుకోండి. అందంగా ఉంది వచ్చింది. అలాంటి వాళ్ళని, అలాంటి అమ్మాయిల మైండ్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని కామెంట్స్ చేశారు. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అన్నారు.
ఏదీ మంచిది కాదు, ఏదీ చెడ్డది కాదు. మనకి మంచిది అనేది తెలుస్తుంది, చెడు అనేది తెలుస్తుంది. బ్యాడ్ అన్నప్పుడు అటువైపు వెళ్ళకూడదు. అదే పరిమితి. మనకి సెట్ కానిది, తెలియని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు. అలాంటి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయని..అలాంటివి ఏ అమ్మాయికైనా, అబ్బాయికైనా జరగకూడదని ఆమె అన్నారు. అయితే తన విషయంలో ఆ హీరో అలా చేయడంపై వెంటనే ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చేసానని.. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని.. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగానని ఆమె అన్నారు. మరి ఆ హీరో ఎవరో అనేది మాత్రం ఆమె చెప్పలేదు. మరి అర్చన జీవితంలో ఎదురైన ఈ సంఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.