Anupama: ఆ తప్పుడు పని చేసే వారంటే నాకు అసహ్యం: హీరోయిన్ అనుపమ!

అనుపమ పరమేశ్వరన్…తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మలయాళం లో ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి… అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాందించింది. అనంతరం ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అనంతరం శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్దం, హలో గురు ప్రేమకోసమే, రాక్షాసుడు లాంటి హిట్ సినిమాలు లతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. అచ్చమైన తెలుగు అమ్మాయిల కనిపిస్తూ కుర్రకారు మనసు దోచుకుంది అనుపమ. ఇటీవల కొంతకాలం నుంచి సినిమాల్లో అనుప జోరు తగ్గింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటే ఈ అమ్మడు.. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఫోటోను అనుపమ పరమేశ్వరణ్ ఇన్ స్టా లో షేర్ చేసింది. ఎప్పుడు కూల్ గా కనిపించే అనుపమ ఘాటుగా స్పందిస్తూ తాజాగా పోస్ట్ పెట్టింది.

అనుపమ షేర్ చేసిన ఫోటోలో రోడ్ల నిండా చెత్త కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ విసిరేసిన చెత్తతో రోడు నిండిపోయి ఉంది. ఇక ఆ చెత్తను ఆవులు తింటూ ఉన్నాయి. ఈ ఫోటోలు షేర్ చేసిన అనుపమ ఘాటుగా స్పందించారు. అలా రోడ్లపై చెత్త ఉండానికి అందరని బాధ్యుల్ని చేస్తూ తిట్టేసింది. “నా గుడ్ మార్నింగ్ రోజూ ఇలానే మొదలవుతోంది.. ఇంకా ఈ భూమ్మీద ఇలాంటివి చేస్తూ ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నవారిని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది” అంటూ అనుపమ ఫోటో పోస్ట్ చేసింది. సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్ అంటూ ఈ పోస్ట్ కి హ్యాష్ ట్యాగ్‌  కూడా జత చేసింది. ఇక దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మీ ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో ఇలానే ఉంటాయని, అయినా నువ్వు ఇలా పోస్ట్ పెట్టే బదులు క్లీన్ చేస్తూ.. ఓ అవగాహన వీడియో చెయ్యి..అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుపమ ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి సినిమాలు చేస్తోంది. 18 పేజీస్, కార్తికేయ-2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. మరి.. అనుపమ పెట్టిన పోస్ట్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV