తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. కానీ.. మత్తుకళ్ల సుందరి అను ఇమ్మాన్యుయేల్ కి టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కలిసి రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు ఒకటి రెండు తప్ప అన్నీ డిజారస్టర్స్ అయ్యాయి. అందం, అభినయం ఉన్న అను ఇమ్మాన్యుయేల్ కి స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంటుందని భావించారు.. కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బలనటిగా పరిచమైనది అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.
తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘మజ్ను’చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తర్వాత తెలుగు లో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల మహా సముద్రం లాంటి మూవీస్ లో నటించింది. కానీ అను ఇమ్మాన్యుయేల్ ఏ మూవీ పెద్దగా పేరు తీసుకు రాలేదు.
ఇదిలా ఉంటే అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి గిలిగింతలు పెడుతుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి జీన్స్ నెక్కరు.. హాట్ లుక్ తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ తెగ వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.