అంజలా జవేరీ.. ఈమె గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమించుకుందాం రా!’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే విజయాన్ని ఖాతాల్లో వేసుకుంది ఈ బ్యూటీ. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో ‘చూడాలని ఉంది’, బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’, నాగార్జునతో ‘రావోయి చందమామ’ సినిమాల్లో నటించింది. ఇలా స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన అందంతో కుర్రాళ్ల హృదయాలను నిలిచిపోయింది. ఇంతలా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలా జవేరీ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. ఇక్కడ ఓ విశేషం ఉంది. ఆమె భర్త మనకు బాగా తెలిసిన టాలీవుడ్ నటుడే. అయితే ఈమె భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అనేది చాలామందికి తెలియదు. అతడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు తరుణ్ రాజ్ అరోరా.
‘హిమాలయ్ పుత్ర’ అనే బాలీవుడ్ చిత్రంతో సినీ పరిశ్రమకు అంజలా జవేరీ పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమిచుకుందాం రా’ సినిమాతో టాలీవుడ్ కు పరియమైంది ఈ బ్యూటీ. తెలుగు చిత్రపరిశ్రమలో అడుగు పెట్టిన అతి తక్కువకాలంలోనే అంజలా మంచి గుర్తింపు సంపాందించింది. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. ‘సమర సింహా రెడ్డి’ సినిమాలో పౌరుషం కలిగిన రాయలసీమ ఆడపిల్ల అంజలి పాత్రలో ఈ అమ్మడు నటించిన తీరు ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తరువాత రావోయి చందమామ, దేవీ పుత్రుడు, భలేవాడివి బాసు వంటి సినిమాలో నటించింది. అనంతరం కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మధ్యలో అడపదడప సినిమాలో కనిపిస్తూ వచ్చింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే చిత్రంతో మళ్లీ తెరపై ఫుల్ లెన్త్ రోల్ కనిపిచింది.
ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె భర్త ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు తరుణ్ రాజ్ అరోరా. మెగాస్టార్ చిరంజీవీ హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో మోడ్రన్ విలన్ గా టాలీవుడ్ తరుణ్ అరోరా పరిచయమయ్యారు. ఆ సినిమాలో తనదైన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కాటమరాయుడు, జయజానకి నాయక, అర్జున్ సురవరం వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. తరుణ్ అరోరా, అంజలా జవేరి కంటే ఏడేళ్ల చిన్నవాడు. అయినప్పటీకీ వీరిద్దరి మనసులు కలవడంతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి.. చివరకు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లై దాదాపు ఆరేళ్లు అయినప్పటికీ పిల్లలు లేరంట. ఆమెకు తగ్గ కథ, పాత్ర వస్తే వెంటనే ఓకే చెబుతుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.