నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన హీరోయిన్ గా నటించిన అనిత.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తెలుగులో శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో నటించారు. కానీ అవేమీ టాలీవుడ్ లో ఆమెను స్టార్ హీరోయిన్ ని చేయలేకపోయాయి. హిందీ, తమిళ, కన్నడ భాష చిత్రాల్లో కూడా నటించారు. టెలివిజన్ సిరీస్ లలోను, టెలివిజన్ షోస్ లో కూడా నటించిన అనిత.. సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తున్నారు. 2013 అక్టోబర్ 14న రోహిత్ రెడ్డి అనే బిజినెస్ మేన్ ని గోవాలో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్వ్ రెడ్డి అనే ఏడాదిన్నర బాబు కూడా ఉన్నాడు. అనిత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా ఆమె ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముంబై పుట్లభాయ్ ఛాల్ వద్ద ఉండే గణేష్ మండపాన్ని అనిత తన కొడుకుతో కలిసి సందర్శించారు కొడుకుని ఎత్తుకుని సామాన్యురాలిలా అందరిలో నడుచుకుంటూ గణేషుడిని దర్శించుకున్నారు. అనంతరం గణేష్ మండపంలో పూజలు నిర్వహించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.