సౌందర్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయం కలబోసిన పుత్తడి బొమ్మ. మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిలా మారి.. వారి ప్రేమాభిమానాలను గెలుచుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం అందం మాత్రమే.. గ్లామర్ డాల్.. ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అనే పరిస్థితులు నడుమ.. అవేమి చేయకుండానే.. ముగ్ధమనోహరమైన తన రూపం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించకుంది. తన తోటి హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్‌తో దూసుకుపోతున్న సమయంలో ఏమాత్రం హద్దులు దాటకుండా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సౌందర్య. వెండితెరపై చెరగని ముద్ర వేసి.. ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న సౌందర్య.. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. నేటికి కూడా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో ఎక్స్‌పోజింగ్ విషయంలో సౌందర్యకు ఎలాంటి అభిప్రాయాలుండేవో.. ఆమె స్నేహితురాలు, తోటి నటి, హీరోయిన్ ఆమని చెప్పుకొచ్చారు. 22నేను సినిమాల్లో కొంతవరకు ఎక్స్‌పోజింగ్ చేశాను. కానీ సౌందర్య చేయలేదు. దీని గురించి సౌందర్యని ఒకసారి అడిగాను. ‘ఎందుకే నువ్వు ఎక్స్‌పోజింగ్ అంటే అంత దూరం వెళతావు అని అడిగాను. దీనికి సౌందర్య.. ఎందుకే ఎక్స్ పోజ్ చేయాలి. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త నన్ను ప్రశ్నించడా.. ఎందుకు అలా చేశావ్ అని అడగడా. రేపు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అని తిరిగి నన్నే ప్రశ్నించింది’’ అని ఆమని చెప్పుకొచ్చింది.
‘‘‘ఇప్పుడు డబ్బు కోసం ఎక్స్ పోజింగ్ చేసేస్తాము. రేపటి పరిస్థితి ఏంటి. భవిష్యత్తులో నా భర్త, పిల్లలతో కలిసి నా సినిమాలు చూడాలంటే సిగ్గు పడే విధంగా ఉండకూడదు. నేను ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ చేస్తే.. రేపు ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉంటుంది కదా’ అని చెప్పింది. అంటే సౌందర్య సినిమాల్లోకి వచ్చే ముందే అలా ఫిక్స్ అయి వచ్చింది. ఎవరి స్టైల్ వాళ్ళది. అది సౌందర్య స్టైల్.. తప్పు లేదు అంటూ’’ అని చెప్పుకొచ్చింది ఆమని. మరి సౌందర్య చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.