చాలా మంది హీరోయిన్లు గ్లామర్ ప్రాధాన్యమున్న పాత్రలతో సినిమాల్లో రాణిస్తుంటారు. కథతో సంబంధం లేకుండా, సినిమాలో తమ పాత్రకు బలం లేకున్న ఎక్కువ మంది హీరోయిన్లు అందాలతో రాణిస్తుంటారు. కొందరు మాత్రం కథా బలమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుని కెరీర్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందంతో సంబంధం లేకుండా తమదైన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్ల లో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. ఈ అమ్మడు అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇవ్వకుండా కథబలమున్న పాత్రలే ఎంచుకుంటుంది. అందుకు నిదర్శనమే ఏ హీరోయిన్ చేయని ధైర్యం చేసింది. మొదటి చిత్రం ‘కాక్కాముట్టైత్ర’ లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె వయస్సుకు తగ్గ క్యారెక్టర్లలో కాకుండా కథకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో ఒదిగిపోతుంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్నారు. ఇది నిజ జీవితంలో కాదులేండి. ఓ సినిమాలో ఐశ్వర్య ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించనుంది.
ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తమ ఇంటి ఆడపిల్లలో తెలుగు ప్రేక్షకులు అనుకునే తన నటనతో ఐశ్వర్య అదరగొట్టింది. ఆ సినిమాతోనే ఐశ్వర్యకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆ తరువాత ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలో నటించింది. ఇలా తెలుగు , తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలో నటించింది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించేందుకు ఐశ్వర్య ఎప్పుడు వెనకాడదు. కథకు బలం చేకూర్చేలా ఉంటే.. తాను ఎలాంటి పాత్రలోనైన చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తన తొలి చిత్రం ‘కాక్కాముట్టైత్ర’ తోనే ఆ విషయాన్ని నిజం చేసింది.
తాజాగా ఐశ్వర్య ముగ్గురు పిల్లల తల్లిగా ఓ సినిమాలో నటించనుంది. నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్న ‘ఫర్హానా’ అనే చిత్రంలో ఐశ్వర్య నటించనుంది. ఇంతకు ముందు ఒరునాళ్ కత్తు, మాన్ స్టర్ చిత్రాలతో ప్రేక్షకుల్లో దర్శకుడిగా నెల్సన్ మంచి క్రేజ్ సంపాదించాడు. తాజాగా ఓ వెరైటీ కథతో ఫర్హానా చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రమేష్ కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సెల్వరాఘవన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జస్టిస్ ప్రభాకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.