తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ పరంగా స్కోప్ ఉన్నప్పటికీ.. నటనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ హీరోయిన్ల క్యారెక్టర్స్ ని డిజైన్ చేసేవారు. ఓవైపు భార్యంటే ఇలా ఉండాలి.. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనిపించేలా ఉండేవి ఆ పాత్రలు. అలా ఇండస్ట్రీలో అసలు సిసలైన గృహిణి అంటే.. భార్యంటే ఇలా ఉండాలి అని తన నటనతో మెప్పించిన నటి ఆమని.
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు హీరోల పాత్రలకు సమానంగా హీరోయిన్స్ పాత్రలు ఉండేవి. గ్లామర్ పరంగా స్కోప్ ఉన్నప్పటికీ.. నటనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ హీరోయిన్ల క్యారెక్టర్స్ ని డిజైన్ చేసేవారు. ఓవైపు భార్యంటే ఇలా ఉండాలి.. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనిపించేలా ఉండేవి ఆ పాత్రలు. కానీ.. రానురాను సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు స్కోప్ లేకుండా పోతోంది. కేవలం సాంగ్స్, రెండు మూడు లవ్ సీన్స్ కోసమే హీరోయిన్స్ ని తీసుకుంటున్నారు. అప్పట్లో మాదిరి హీరోకి పోటాపోటీగా.. ఫుల్ లెన్త్ క్యారెక్టర్స్ కరువైపోయాయి. ముఖ్యంగా చూడగానే తెలుగుదనం కొట్టొచ్చినట్లుగా కనిపించే ఎరా పోయింది.
తెలుగు ఇండస్ట్రీలో అసలు సిసలైన గృహిణి అంటే.. భార్యంటే ఇలా ఉండాలి అని తన నటనతో మెప్పించిన నటి ఆమని. ఆమని అనగానే అందరికీ ముందుగా మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, జంబలకిడి పంబ, శుభ సంకల్పం.. లాంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కళ్ళముందు మెదులుతుంటాయి. ఆ రోజుల్లో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన అలరించిన ఆమని.. కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు చేశారు. అదీగాక హీరోయిన్ గా ఆమనికి సక్సెస్ రేట్ ఎక్కువ. అలాంటిది కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరమైంది ఆమని. ఎన్నో మంచి మంచి పాత్రలు పెళ్లి తర్వాత నటనకు దూరమవ్వడంతో మిస్ అయ్యింది.
ప్రస్తుతం హీరోహీరోయిన్స్ కి తల్లి, అత్త క్యారెక్టర్స్ చేస్తోంది ఆమని. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తన కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. అలాగే తన మొదటి తెలుగు సినిమా ‘జంబలకిడి పంబ’ టైంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని కూడా గుర్తుచేసుకుంది. అందులో సీనియర్ నటుడు నరేష్ హీరో. కాగా.. ఆ సినిమాలో బీర్ తాగే సీన్ రియల్ గా చేసిందట ఆమని. దాని గురించి ఆమని మాట్లాడుతూ.. “ఆ సినిమాలో మందుకొట్టే సీన్, సిగరెట్ కాల్చే సీన్ ఉన్నాయని అని ముందే డైరెక్టర్ నాకు చెప్పలేదు. షూటింగ్ స్పాట్‌కు వెళ్ళాక చెప్పారు. నాకు అదంతా కొత్త.. బాటిల్ లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారేమో అనుకున్నా. కానీ.. రియల్ బీర్ ఇచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తే బయటికి పొంగుతుంది.. అప్పుడు నువ్వు సిప్ చేయాలన్నారు. ఒకే షాట్ అన్నారు డైరెక్టర్. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మా.. తాగు అని ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఆ సీన్ చేశాను” అని ఆమని చెప్పుకొచ్చారు.