ఒకప్పటి హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కున్న విషయాన్ని బయటపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో తనను ఒక దర్శకుడు ఒంటరిగా రావాలంటూ ఫోన్ చేయించాడని వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఇప్పటిది కాదు. 90స్ నుంచి ఉంది. ఈ తరం హీరోయిన్సే కాదు, పాత తరం హీరోయిన్లు, నటీమణులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేశారు. ఆ విషయాన్ని వారు కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఆమని పెదవి విప్పారు. ఒక దర్శకుడు తనను ఒంటరిగా రమ్మన్నాడు అని వెల్లడించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశాల పేరుతో అవకాశవాదులు కొత్తగా వచ్చే హీరోయిన్స్ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది.
జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, మావిచిగురు వంటి కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమని.. సాధారణ గృహిణి పాత్రల్లో బాగా రిజిస్టర్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లోనూ గ్లామరస్ పాత్రల్లో నటించి మెప్పించారు. 90స్ టైంలో స్టార్ స్టేటస్ అనుభవించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. అయితే తాను ఇంత సక్సెస్ అవ్వడం వెనుక చాలా కష్టాలు పడ్డానని ఆమె వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావడానికి తాను ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని.. ఆడిషన్స్ కోసం కోలీవుడ్ లో కొన్ని కంపెనీలకు వెళ్లేదాన్నని.. అయితే కొన్ని కంపెనీ వాళ్ళు తనను సెలెక్ట్ చేస్తే.. కొన్ని కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేసేవారని అన్నారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఆమె పెదవి విప్పారు.
ఒక కంపెనీకి వెళ్తే.. చెప్పి పంపిస్తామని అనేవారని, తర్వాత రోజు ఫోన్ చేసి బీచ్ కి వస్తారా అని అడిగేవారని అన్నారు. మేనేజర్ ఫోన్ చేసి సార్ రమ్మంటున్నారని అడిగాడని.. అప్పుడు అమ్మ కూడా వస్తానంటే.. ఆమె అవసరం లేదు మీరొక్కరే వస్తే చాలు అని అన్నారని గుర్తు చేసుకున్నారు. డైరెక్ట్ గా అడగకుండా ఇన్ డైరెక్ట్ గా అడిగేవారని.. అయితే మొదట్లో తనకు ఇలా ఉంటారని తెలియదని అన్నారు. దేనికి పిలుస్తున్నారో తెలుసుకోవాలి కదా, ఇలాంటివి ఉంటాయి ఇండస్ట్రీలో అని మేనేజర్స్ చెప్పడంతో అప్పటి నుంచి జాగ్రత్త పడినట్లు ఆమె చెప్పారు. అయితే ఇండస్ట్రీలో చెడ్డ వాళ్ళే కాదని, మంచి వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. తాను మంచి మనుషులతో పని చేశానని.. చెడ్డ వాళ్ళ జోలికి పోలేదని అన్నారు.