అలాగే గత కొద్ది రోజుల క్రితమే విడుదలైన బిచ్చగాడు 2 మూవీ లో బిచ్చగాడు పాత్రలో నటించి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజీనీకాంతో హీరోగా తెరకెక్కుతున్న
కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడీయన్ యోగిబాబు అందరికి సుపరిచితమే. యోగిబాబు ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. చిన్న చిన్న కామెడీ పాత్రలతో సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన ఈయన అతి తక్కువ కాలంలోనే పైకి స్టార్ కమెడియన్‌గా మారిపోయారు. 2009లో వచ్చిన ‘యోగి’ అనే సినిమా ద్వారా ఆయన వెండితెరకి పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడం తో అప్పటి నుండి అందరూ ఆయనని యోగి బాబు అని పిలవటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే యోగిబాబు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో యోగిబాబు తన సత్తా చాటుకున్నాడు. ప్రతి సంవత్సరం 6 సినిమాలకు పైగా నటిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో లవ్ టుడే, వారసుడు, కాజల్ అగర్వాల్ కోస్టి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మరింత అలరింప చేశాడు
.అలాగే గత కొద్ది రోజుల క్రితమే విడుదలైన బిచ్చగాడు 2 మూవీ లో బిచ్చగాడు పాత్రలో నటించి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజీనీకాంతో హీరోగా తెరకెక్కుతున్న జైలర్ మూవీలో నటిస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. యోగిబాబు రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఆ రెమ్యునరేషన్ విషయానికి వస్తే కోలీవుడ్ కి చెందిన కొంతమంది హీరోలు, కమెడియన్లు అందరూ మన యోగిబాబు కన్నా తక్కువే అని వినిపిస్తుంది. ఎందుకంటే, అతను ఒకరోజుకు షూటింగ్ లో పాల్గొంటే ఏకంగా రూ.18 లక్షల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఇంత రెమ్యునరేషన్ కోలీవుడ్ హీరోలు కూడా తీసుకోవడం లేదు. ఇక, 10 రోజుల వరకు షూటింగ్ లో ఉంచుకుంటే రూ.2 కోట్ల రెమ్యునరేషన్ అతని అకౌంట్లో పడాల్సిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో యోగిబాబు అతి ఖరీదైన కమెడియన్స్ లో ఒకరిగా మారిపోయారు.