యశ్.. ఈ పేరు ప్రస్తుతం భారతీయ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన యశ్.. నేడు దేశంలోనే స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. తన సినీ ప్రయాణంలో కేజీఎఫ్ అనేది ఓ అద్భుతం. ఈ సినిమాతో యశ్ కు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ లో రాఖీభాయ్ గా యశ్ నటన అనిర్వచనీయం. అందుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అనేక రికార్డులను కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 తిరగరాశాయి. ఈ సినిమాలోతో యశ్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంచితే.. గురువారం యశ్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఆయన భార్య రాధిక పండిట్ ఎమెషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో సినీ ప్రముఖల నుంచే కాకుండా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పెళ్లి రోజులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాధిక పండిట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యశ్ భార్య రాధిక పండిట్ కూడా ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. ఆమె కన్నడలో హీరోయిన్ గా పలు సినిమాలు నటించింది. యష్ తో కలిసి రాధిక ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అలా ప్రేమించుకున్న వాళ్లిద్దరు కొంతకాలం తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యశ్, రాధిక పండిట్ ల వివాహం 9 డిసెంబర్ 2016లో జరిగింది. ప్రస్తుతం వీళ్లకి ఒక బాబు, పాప ఉన్నారు. గురువారం వీరి పెళ్లి రోజు కావడంటో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వారి వివాహం జరిగి ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా యష్ భార్య రాధిక తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. యశ్ తో దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. “మనం సినిమా కావొచ్చు, మనం హ్యాపిగా ఉండొచ్చు, మనం కోపంగా ఉండొచ్చు. కానీ మనం అనేది నిజం. ఈ ఆరేళ్ల నా వైవాహిక జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చినందకు చాలా కృతజ్ఞతలు. హ్యాపీ యానివర్సరీ. లవ్ యూ” అంటూ రాధిక పోస్ట్ చేసింది. దీంతో సినీ ప్రముఖులు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాక అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ఆ దంపతులకు వెడ్డింగ్ యానివర్సరీ విషెష్ తెలిపారు. ఇక యశ్ సినిమాల విషయానికి వస్తే.. కేజీఎఫ్-2 భారీ హిట్ తర్వాత ఆయన సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు. అయితే సినీ ప్రియులు కేజీఎఫ్-3 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్-3పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్ తో కలిసి పని చేయనున్నారని సమాచారం. ఆ సినిమాకు యశ్-19 అని పేరు పెట్టారు.