ఒక సినిమాని పూర్తి చేయాలంటే ఒక యుద్ధమే చేయాలి. పైకి రంగు రంగులుగా కనిపించే సినిమా వెనుక అంతటి కష్టం ఉంటుంది. మేకర్స్ ఎప్పుడైనా ఓ సినిమాని ఆలస్యం చేస్తుంటే ఆడియన్స్ గా మనకి కోపం వస్తుంటుంది. కానీ.., ఆ ఆలస్యం వెనుక లెక్కకి మించిన కారణాలు ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఓ సినిమా విషయంలో అదే జరగబోతుంది. ఎప్పుడో 2016 లో సెట్స్ పైకి వెళ్లిన ఓ సినిమా.. ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. అలా అని.. అదేదో చిన్నాచితక హీరో నటించిన సినిమా కాదు. చియాన్ విక్రమ్ అందులో హీరో. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆ సినిమాకి దర్శకుడు. ఇంతటి స్టార్ కాస్ట్ ఉన్న ఓ సినిమా 7 ఏళ్ళ తరువాత రిలీజ్ కాబోతుండటం వెనుక.. చాలానే కారణాలు ఉన్నాయి.
‘ధృవ నక్షత్రం’ (తమిళంలో ధృవ నచ్చతిరమ్) అనే మూవీ 2016 లో సెట్స్ పైకి వెళ్ళింది. కానీ.. ఈ మూవీకి మధ్యలో చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాకి గౌతమ్ మీనన్ కూడా ఒక నిర్మాత కావడం, అదే విధంగా ఆ సమయంలో అతని సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడం, విక్రమ్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం, గౌతమ్ మీనన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవ్వడం లాంటి కారణాలు ‘ధృవ నక్షత్రం’ మూవీకి అడ్డంకిగా మారాయి. కానీ.. “పొన్నియన్ సెల్వన్” తర్వాత విక్రమ్ మార్కెట్ కాస్త పెరగడంతో మళ్ళీ ఈ మధ్య ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇలా కారణం ఏదైనా ‘ధృవ నక్షత్రం’ ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధం అయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో 2023 సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఏ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.
#John will meet you 🔜#Summer2023?#ChiyaanVikram @menongautham @Jharrisjayaraj #KondaduvomEntertainment @SonyMusicSouth #DhruvaNatchathiram pic.twitter.com/nJKto4kvGV
— sridevi sreedhar (@sridevisreedhar) February 7, 2023