సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హోదాను అనుభవిస్తున్న నటీనటులంతా ఒకప్పుడు ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. అయితే ఒక్కోసారి ఊహించని సంఘటనలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. నటుడిగా నిరూపించుకోవాలనుకున్న సమయంలో చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడిన వారిలో ఒకరు నటుడు విక్రమ్. అసలేమైందంటే..?
రంగుల ప్రపంచంలో అనుకున్నంత ఈజీగా సక్సెస్ రాదు. ఈ రోజుల్లో స్టార్ హోదాను అనుభవిస్తున్న నటీనటులంతా ఒకప్పుడు ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. అయితే ఒక్కోసారి ఊహించని సంఘటనలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. నటుడిగా నిరూపించుకోవాలనుకున్న సమయంలో చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడిన వారిలో ఒకరు నటుడు విక్రమ్. చెన్నైలో పుట్టిన విక్రమ్‌కు విజయం చాలా లేట్‌గా పలకరించింది. తెలుగులో చిత్రాల్లో కూడా నటించారు విక్రమ్. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన అక్కపెత్తనం, చెల్లెలి కాపురంలో తెలుగు తెరకు పరిచయమ్యారు. ఓ తెలుగు సినిమాలో హీరోగా నటించిన విడుదల కాలేదు. దీంతో మళ్లీ సహాయక పాత్రలో పోషించారు.
1990లో సినిమాలోకి వచ్చినా.. చాలా కాలం పాటు హిట్ మొహం ఎరుగలేదు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. తమిళంలో సేతు(తెలుగులో శేషు) మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. 2003లో విడుదలైన పితామగన్ (తెలుగులో శివపుత్రుడు) అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాతో ఉత్తమ జాతీయ నటుడు పురస్కరాన్ని అందుకున్నారు. అయితే విక్రమ్ తొలి నుండి విలక్షణ నటన వైపు మొగ్గు చూపేవారు. సినిమాపై ఫ్యాషన్ తో దర్శకుడు ఎలా మారమంటే అలా మారిపోతారు. సేతు సినిమా కోసం ఏకంగా 16 కిలోలు తగ్గిపోయారంటే.. ఆయనకు సినిమా అంటే ఎంతో ప్రేమ తెలుస్తోంది.
అయితే ఆయనను పరిశీలనగా చూస్తే కుడికాలుపై గీతలా ఉంటుంది. అది ఏంటో చాలా మందికి తెలియదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటంటే చిన్నప్పటి నుండే నాటకాలపై మక్కువ పెంచుకున్న విక్రమ్ పలు స్టేజ్ షోల్లో పాల్గొన్నాడు. సినిమాల వైపు రావాలనుకున్న అతడికి యాక్సిడెంట్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్నేహితుడితో కలిసి మోటారు బైక్ పై వెళుతుండగా.. కుడికాలుకు పెద్ద ప్రమాదం జరిగింది. విక్రమ్ ఎముకలు నలిగిపోయి, మోకాలి నుంచి చీలమండ వరకు చర్మం, మృదు కణజాలం దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆయనకు 23 ఆపరేషన్లు జరిగాయి.
అతడు కోలుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. అప్పటి వరకు మంచాన పడ్డారు విక్రమ్. అప్పటికి పూర్తిగా కోలుకోలేదు. ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో కూడా బాధపడ్డాడు. కానీ అవన్నీ ఆయనను బాధించలేదు. నటుడిని కావాలన్న తన కోరిక ముందు.. అతడికి ఇవన్నీ చాలా చిన్నగా అనిపించాయి. 1990లో ఓ చిన్న బడ్జెట్ మూవీ ద్వారా తన కలను నెరవేర్చుకున్నారు. అలా తన వద్దకు వచ్చిన అవకాశాలను విడిచిపెట్టకుండా చిన్న హీరో నుండి స్టార్ స్థాయికి చేరాడు. ఇప్పుడు ఆయనకు 56 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో హ్యాండ్సమ్ లుక్స్‌తో కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తుంటారు చియాన్. ప్రస్తుతం ఆయన నటించిన మణిరత్నం సినిమా పెన్నియన్ సెల్వం-2 త్వరలో విడుదలకు సిద్ధం కానుంది.