మన దేశంలోనే ఏ సెలబ్రిటీకి సాధ్యం కానీ ఓ సరికొత్త రికార్డుని తళపతి విజయ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విషయం?
తళపతి విజయ్.. పేరుకే తమిళ హీరో. కానీ తెలుగు వాళ్లకు బాగా పరిచయం. ఎంతలా అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే కారణం లేకుండా ఇతడిని ట్రోల్ చేస్తూ ఉంటారు. రకరకాల పేర్లతో సంభోదిస్తూ విజయ్ ని ఆడుకుంటూ ఉంటారు. అదంతా ఫన్నీగానే చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వారసుడు’గా వచ్చిన విజయ్.. టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘లియో’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇదంతా అలా ఉండగానే ఇప్పుడు ఓ విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ప్రతి ఒక్కరికీ దాదాపు ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా అన్ని అకౌంట్స్ ఉంటాయి. కొందరు సెలబ్రిటీలు మాత్రం చాలా లిమిటెడ్ గా సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా తళపతి విజయ్ విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదివారం ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ విజయ్ కు.. అభిమానులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫాలోవర్స్ విషయంలో రికార్డు క్రియేట్ అయ్యేలా చేశారు.
ఇప్పటివరకు ట్విట్టర్ లో మాత్రమే ఉన్న విజయ్.. తాజాగా ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ ని కేవలం 97 నిమిషాల్లోనే అందుకున్నాడు. ఇంత ఫాస్ట్ గా 1 మిలియన్ మార్క్ ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా నిలిచాడు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ ఘనత సాధించిన మూడో సెలబ్రిటీగా నిలిచాడు. విజయ్ కంటే ముందు బీటీఎస్ 43 నిమిషాల్లో, నటి ఏంజెలీనా జోలీ 59 నిమిషాల్లో.. మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ స్టోరీ రాసే టైంకి విజయ్.. 4 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. మరి ఇన్ స్టాలో విజయ్ క్రేజ్ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Breaking records and hearts, #ThalapathyVijay is the fastest Indian celebrity to reach 4M followers AND 4M likes on a single photo on Instagram! 🔥🔥🔥 #LEO #LeoFilm #BloodySweet @actorvijay #ThalapathyOnINSTAGRAM pic.twitter.com/0nMU3WZEZY
— Actor Vijay Team (@ActorVijayTeam) April 3, 2023