తెలుగు ఇండస్ట్రీలో స్వయంవరం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత వేణు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అలీతో సరదా టాక్ షోకు హాజరయ్యాడు. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
ఇంస్ట్రీలో స్టార్ కమెడియన్ అలీ అంటే ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎంతో మంది స్టార్ నటులు ఆయనతో కలిసి నటించారు. ప్రస్తుతం అలీ ఓ షో చేస్తున్నారు.. ఇందులో ఇండస్ట్రీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. తాజాగా నటుడు వేణు తొట్టెంపూడి ఆలీతో మాట్లాడుతూ.. ఎంతో మంది అలీ షోకి వెళ్తున్నారు.. నువ్వెప్పుడు వెళ్తావ్ .. వెళ్లరా అంటూ తన తల్లి అడిగేవారని తెలిపారు. నా ఫస్ట్ సినిమా ఆయనతోనే నటించాను.. ఆయన చొక్కానే నేను ఇప్పుడు వేసుకున్నా అంటూ నవ్వులు పూయించాడు వేణు.
ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. వాస్తవానికి నేను భారతీ రాజా సినిమాతో వెండితెరకు పరిచయం కావాల్సిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఒక సందర్భంగా వేణు ని నేనే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉండేది.. కానీ అది మిస్ అయ్యింది అంటూ కన్నీరు పెట్టుకున్నట్లు వేణు గుర్తు చేశారు. పూరి జగన్నాథ్ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ మంచి హిట్ టాక్ వచ్చింది. మొదట ఆ కథ నాకే చెప్పారు.. కానీ చేయలేకపోయాను. ఆ తర్వాత పూరి మరోసారి తన దగ్గరకు వచ్చి ‘దేశముదురు’ కథ చెప్పాడని, హీరో నువ్వేనంటూ చెప్పి. అది అల్లు అర్జున్ తో తెరకెక్కించాడని అన్నారు.
రాజకీయాలపై స్పందిస్తూ.. తన తల్లి సోదరుడు మాగంటి అంకినీడు మచిలీపట్నం ఎంపీగా చేశారు. దాంతో తనకు పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున ఉందని ప్రచారాలు జరిగాయి. కానీ ఆయన మాత్రం ‘నీ సినిమా మంచి హిట్ అయితేనే నేను నా మేనల్లుడు అని చెప్పుకుంటా.. లేదంటే చెప్పను’ సరదాగా అనేవారని తొట్టెంపూడి వేణు గుర్తుచేసుకున్నారు. పదేళ్ల కిందట ఎన్టీఆర్ నటించిన దమ్ము, ఆ తర్వాత రామాచారి అనే చిత్రాల్లో వేణు కీలక పాత్రలు పోషించాడు.
పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో పోలీసు అధికారి మురళితో రీఎంట్రీ ఇస్తున్నాడు. ‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి.. గోపిక.. గోదావరి’ సినిమాలతో విశేష క్రేజ్ సంపాదించుకున్నారు వేణు. తాజాగా వేణు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.