Venu: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు.. మంచి కామెడీ పండించే హీరోలలో ఒకరిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
కొన్నేళ్ళకు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి బావ రోల్ చేశాడు. ఆ తర్వాత 2013లో రామాచారి అనే సినిమాలో చివరిసారిగా కనిపించాడు. మరి ఎందుకోగానీ ఆ తర్వాత దాదాపు 9 ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక ఇన్నేళ్లకు మళ్లీ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో రీఎంట్రీకి రెడీ అయిపోయాడు.
ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ ఇటీవలే ఆలీతో సరదాగా షోలో హాజరయ్యాడు. ఇక ఈ షోలో తన కెరీర్, హిట్స్ ప్లాప్స్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇలా అన్ని విషయాలు షేర్ చేసుకున్న వేణు.. తాను మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు గారి మేనల్లుడిని అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వేణు మదర్ మాగంటి అంకినీడుకి స్వయానా చెల్లి కావడంతో.. అలా మేనమామ కూడా సపోర్ట్ చేసేవారని చెప్పాడు వేణు. ప్రస్తుతం వేణు మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నటుడు వేణు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.