నందమూరి హీరో తారకరత్న.. గుండెపోటుకు గురై 3 వారాలకు పైనే అయిపోయింది. ఆయన హెల్త్ గురించి పలు విషయాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు స్పృహలోకి రాకపోవడానికి కారణం ఏంటి?
నందమూరి తారకరత్న.. నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ సందర్భంగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన అతడిని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చేర్పించారు. ఇది జరిగిన దాదాపు మూడు వారాలు కావొస్తుంది. అయితే ఇప్పటివరకు తారకరత్నకు చికిత్స జరుగుతుందని, మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తారని రూమర్స్ వస్తున్నాయి తప్పితే.. తారకరత్న ఎప్పుడు కోలుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. స్పృహలోకి ఎప్పుడొస్తాడనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన తాజా న్యూస్ కూడా ఒకటి వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నందమూరి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి వచ్చిన హీరో తారకరత్న. అప్పట్లో పలు సినిమాలతో హిట్ కొట్టాడు గానీ తర్వాత తర్వాత ఫ్లాప్స్ రావడంతో నటించడం పూర్తిగా తగ్గించేశాడు. గత కొన్నాళ్ల నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. అందులో భాగంగానే నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే హార్ట్ ఎటాక్ రావడంతో తొలిరోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటినుంచి తారకరత్నకు దేశంలో బెస్ట్ డాక్టర్స్ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని బతికించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైంలో తారకరత్న హెల్త్ గురించి ఓ విషయం బయటకొచ్చింది. అతడి గుండెల్లో 90 శాతం బ్లాకేజీ ఉందని, అందువల్లే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని అంటున్నారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేరిన వెంటనే.. ఓ హార్ట్ సర్జరీ కూడా చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు తారకరత్న కుప్పకూలి పడిపోయిన టైంలో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొంతమేర డ్యామేజ్ కూడా జరిగిందట. అందువల్లే ఇప్పటికీ స్పృహలోకి రాలేదని అంటున్నారు. అతడి మెదడు పనితీరు మెరుగుపరిచేందుకు, ఎప్పటిలానే వర్క్ చేసేందుకు స్పెషల్ న్యూరాలజిస్ట్ తో చికిత్స చేయిస్తున్నారట. దీనితోపాటు డాక్టర్స్ స్పెషల్ టీమ్ ఒకటి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉందని సమాచారం. డాక్టర్స్ కూడా తారకరత్న పూర్తిగా కోలుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అతడి తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇదే జరిగితే తారకరత్న ప్రస్తుతం ఎలా ఉన్నాడు ఏంటనేది అభిమానులకు, ప్రజలకు తెలిసే అవకాశముంది. మరి తారకరత్న ప్రస్తుత పరిస్థితిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Get well soon #TarakaRatna anna❤️ pic.twitter.com/uRJowZW0eB
— SURESH TARAKiSM (@SureTarak) January 29, 2023