మన సమాజంలో మగవారు ఎన్ని పెళ్లిల్లు చేసుకున్నా దాని గురించి ఎవరు పెద్దగా పట్టించకోరు కానీ.. ఆడవారి విషయానికి వస్తే మాత్రం దాన్నో విడ్డూరంగా చూస్తారు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది కాస్త అతిగా ఉంటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సింగర్ సునీత. ఆమె రెండో పెళ్లి చేసుకోవడంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పటికి కూడా కొందరు ఈ విషయంలో సునీతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. సునీత వివాహం తర్వాత.. ఆ రేంజ్ లో పెళ్లి వార్తలు వచ్చింది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించే. భర్త చనిపోయిన తర్వాత సురేఖా వాణి మరో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలో జోరుగా ప్రచారం అయ్యాయి. వీటిపై సురేఖా వాణితో పాటు ఆమె కుమార్తె సుప్రీత కూడా స్పందించారు. ఇవన్ని తప్పుడు వార్తలని తెలిపారు.
ఇది కూడా చదవండి : సురేఖవాణి మెడలో మంగళసూత్రం.. రెండో పెళ్లి అంటూ!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తల్లి సురేఖా వాణి పెళ్లి విషయంపై సుప్రీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందన్నారు. ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ.. ‘‘పెళ్లి చేసుకోవాలా.. వద్దా అని నిర్ణయించుకోవాల్సింది అమ్మే. నాకైతే మా అమ్మకు మళ్లీ ఖచ్చితంగా పెళ్లి చేయాలని ఉంది. అమ్మకు పెళ్లి చేస్తేనే బాగుంటుందనేది నా నమ్మకం. కానీ ఈ విషయంలో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. నాన్న చనిపోయి అప్పుడే మూడేళ్లు అవుతుంది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నాం. ప్రస్తుతం అమ్మ తన కెరియర్ కన్నా.. నా గురించే ఎక్కువ ఆలోచిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : సురేఖా వాణి కూతురి లవ్ మ్యాటర్ లో షాకింగ్ ట్విస్ట్!
‘‘నా వరకు నాకు అమ్మ ఏది చెప్తే అదే ఫైనల్. తను ఏం చెప్తే అదే చేస్తున్నా. నా నిర్ణయాన్ని కూడా గౌరవిస్తుంది. మా కుటుంబానికి బలం, ఆధారం అమ్మే. మా నాన్న ఉద్యోగం కోసం వెతికే సమయంలో అమ్మే అన్నీ చూసుకునేది.. చిన్న చిన్న పాత్రలు చేసి ఫ్యామిలీని పోషించింది. మేం ఇలా ఉన్నాం అంటే అమ్మ వల్లే. తను నిత్యం మా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న చనిపోయిన తరువాత అమ్మపై చాలామంది చాలా దారుణంగా కామెంట్లు పెట్టారు. అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. అందుకే ఆ కామెంట్లు నేను చూడను.. అమ్మని కూడా చూడొద్దని చెప్తుంటాను. నాన్న చనిపోయిన బాధ నుంచి కోలుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మని పార్టీకి తీసుకుని వెళ్తే.. దానిపై కూడా విపరీతంగా నెగిటివ్ కామెంట్లు చేశారు. బాధలేదు.. బాధ్యత లేదు అన్నారు. ఆ తరువాత అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని అన్నారు. అవన్ని చూసి మేం ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అవతలి వాళ్లు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి’’ అంటూ చెప్పుకొచ్చింది. సుప్రీత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.