మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన ఎందరో తారలు.. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తాను కూడా ఈ జాబితాలో చేరతాను అంటున్నారు నటుడు సుమన్. ఆ వివరాలు..
నటుడు సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. పదుల సినిమాల్లో హీరోగా నటించాడు. కెరీర్‌లో కొన్నాళ్లు ఒడిదుడుకులు చవి చూశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సౌత్‌లో అన్ని భాషా చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్.. ఇలా వేర్వేరు పాత్రల్లో నటిస్తూ.. బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా సుమన్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని స్పష్టం చేశాడు. అంతేకాక తాను ఏ పార్టీకి మద్దతిస్తాడో ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆ వివరాలు..
మన దగ్గర సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన వారిలో కొందరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ కూడా సత్తా చాటుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. రోజా వరకు అనేక మంది సినిమా వాళ్లు.. రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ జాబితాలో తాను కూడా చేరనున్నట్లు ప్రకటించాడు సుమన్. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అన్నాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో బుధవారం నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుమన్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సుమన్. త్వరలోనే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అన్నారు. అంతేకాక తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌కే ఉంటుందని తేల్చి చెప్పారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్న సుమన్.. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. వర్షాలు విపత్తులు ప్రతి సంవత్సరం వస్తుంటాయని, కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల కోరే చిన్న చిన్న సాయాలను ప్రభుత్వాలు తప్పకుండా నెరవేర్చాలని సూచించారు. మరి సుమన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.