సినిమా హిట్ కొట్టాలంటే హీరో, హీరోయిన్, కథ, డైరెక్షన్ ఇవే కాదు.. ఎడిటర్‌ది కూడా కీలక పాత్ర ఉంటుంది. ఎడిటర్ సినిమా నిడివిని అనుకున్నట్లు తీసుకురావడానికి కొన్ని సన్నివేశాల్ని కత్తిరిస్తూ ఉంటాడు. అలా కత్తిరించే క్రమంలో ఒక్కోసారి కొన్ని మంచి సన్నివేశాలు కూడా కత్తెరకు బలవుతుంటాయి. అలాంటి సన్నివేశాలనే తర్వాత చిత్ర బృందం ‘డిలీటెడ్ సీన్స్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సినిమా యూనిట్.
అలా సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్‌గా తెరెకెక్కిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ నుంచి కూడా ఓ డిలీటెడ్ సీన్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. సినిమాలో చేరలేకపోయిన ఓ ఉత్కంఠ సన్నివేశాన్ని మీకోసం షేర్ చేస్తున్నా అంటూ సుధీర్‌బాబు ట్విట్టర్ వీడియో పోస్ట్ చేశాడు. అది జైలులో అజయ్, సుధీర్‌బాబు మధ్య జైలులో జరిగే సన్నివేశం. సీన్ స్టార్టింగ్‌లో ‘రండి రండి దయచేయండి’ అంటూ అజయ్ పాటతో మొదలవుతుంది. అజయ్ చాలా కోపంగా సుధీర్‌బాబుతో మాట్లాడుతూ అవమాన పరుస్తాడు. అయినా మన హీరో ఎందుకో స్పందించడు. చివరికి హీరో తినాల్సిన అన్నం ప్లేటులో ఉమ్మేసినా.. కూడా రియాక్ట్ అవ్వకుండా వెళ్లి కూర్చుంటాడు.
నిజానికి ఈ సీన్ సినిమాలో ఉంటే చాలా బాగుండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు. చాలా మంచి సన్నివేశాన్ని తొలగించారే అని అభిప్రాయపడుతున్నారు. ‘పలాస1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70 ఎమ్‌ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి సదరు ప్రేక్షకుడిని బాగానే ఆకట్టుకుంది. పెళ్లిళ్లకు లైట్‌లు వేసే క్యారెక్టర్‌లో సుధీర్‌బాబు నటన అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ ఆనంది తన సహజసిద్ధమైన లుక్స్ తో అందరినీ అలరించింది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.