సోషల్ మీడియాలో నిమిష నిముషానికి మారుతున్న అప్ డేట్స్‌తో పుట్టగొడుగుల్లా వార్తలతో పాటు రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సామాన్యుల విషయంలో అది అంత ప్రభావం చేయకపోవచ్చును కానీ.. సెలబ్రిటీల విషయంలో అది పెద్ద విషయమే. డబ్బు కోసం, పేరు కోసం వాస్తవాలు తెలుసుకోకుండా సెలబ్రిటీలపై ఫేక్ న్యూసులు సృష్టిస్తున్నారు. నటుడు సుధాకర్ చనిపోయాడంటూ..
ఇటీవల కాలంలో వాస్తవాల కన్నా ఫేక్ న్యూసులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదీ వాస్తవమో, ఏదీ అవాస్తమో తెలియక సతమతమౌతున్నారు ప్రజలు. సోషల్ మీడియాలో నిమిష నిముషానికి మారుతున్న అప్ డేట్స్‌తో పుట్టగొడుగుల్లా వార్తలతో పాటు రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సామాన్యుల విషయంలో అది అంత ప్రభావం చేయకపోవచ్చును కానీ.. సెలబ్రిటీల విషయంలో అది పెద్ద విషయమే. డబ్బు కోసం, పేరు కోసం వాస్తవాలు తెలుసుకోకుండా సెలబ్రిటీలపై ఫేక్ న్యూసులు సృష్టిస్తున్నారు. దీని వల్ల ఒక్కోసారి వారు కూడా మానసికంగా కుంగిపోతున్నారు. ఎఫైర్స్, ఆస్తి పాస్తుల వివరాలు అంటూ కొన్ని వార్తలు వస్తుంటే.. పట్టించుకోకపోయినా.. ఏకంగా వారు చనిపో్యినట్లే ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. దీంతో వారే స్వయంగా తెర ముందుకు వచ్చి ‘నేను బతికే ఉన్నా’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆ నటుడి విషయంలో అదే జరిగింది.
ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ సుధాకర్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ఐసీయులో ఉన్నాడని ఓ వార్త.. ఆయన ఏకంగా చనిపోయారంటూ కొన్ని వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై ఆయనే స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఈ వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని, ఇలాంటి పుకార్లు సృష్టించొద్దని సూచించారు.‘అందరికీ నమస్కారం. నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ ఫేక్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి. ఐయామ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నా’ అని సుధాకర్ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై అభిమానులు మండిపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిపై ఇటువంటి రూమర్స్ సృష్టించవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
భారతీరాజా తెరకెక్కించిన ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే సినిమాతో సుధాకర్ సినిమాలోకి ఏంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తెలుగు తమిళ భాషల్లో దాదాపు 400 సినిమాలలో నటించారు. పాత తరం హీరోల దగ్గర నుంచి ఇప్పటి స్టార్ హీరోల వరకూ ఆయన స్నేహితుడిగా నటించారు.. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారారు. చిరంజీవితో కలిసి ‘యముడికి మొగుడు’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. సుధాకర్ చివరగా ‘ఇ ఈ’ అనే చిత్రంలో కనిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్ ఆరోగ్యంపై గతంలోనూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.