తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య నటించిన అఖండ ప్రభంజనం కంటిన్యూ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఊరమాస్ చిత్రంతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. ఈ మధ్యకాలంలో బాలయ్య – బోయపాటిలకు సరైన హిట్స్ లేక అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఈ చిత్రంతో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ వరదరాజులుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
ఇదివరకు డైరెక్టర్ బోయపాటి – బాలయ్య కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమాతో ఫ్యామిలీ హీరో జగపతి బాబు కరుడుగట్టిన విలన్ వరదరాజులుగా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు అఖండ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ కెరీర్.. ఇదే ఊపుతో ముందుకు వెళ్తుందా? అనేది చూడాలి.
శ్రీకాంత్ ఆల్రెడీ కన్నడలో పునీత్ రాజకుమార్ హీరోగా తెరకెక్కిన చివరి చిత్రం ‘జేమ్స్’. అఖండ కంటే ముందే శ్రీకాంత్ ఈ కన్నడ చిత్రంలో నటించాడు. అయితే ఆ సినిమా కంటే ముందే అఖండ రిలీజ్ అవ్వడంతో తెలుగులోనే విలన్ గా లాంచ్ అయ్యాడు. ప్తస్తుతం ఇండస్ట్రీ అంతా అఖండతో పాటు శ్రీకాంత్ పారితోషికం పై టాక్ నడుస్తుంది. ఈ చిత్రం కోసం శ్రీకాంత్ దాదాపు కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మొన్నటివరకు శ్రీకాంత్ కెరీర్ హిట్స్ లేక నెమ్మదించింది. కానీ ప్లాప్స్ లో ఉన్నాకూడా కోటి పైన పారితోషికం ఇచ్చారంటే నమ్మశక్యంగా లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.