చిత్ర పరిశ్రమలో ఇరవైయేళ్లకు పైగా అనుభవం కలిగిన నటులు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికి కొందరు హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. మరికొందరు సైడ్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఆ జాబితాకు చెందిన వారిలో ఒకరు హీరో శ్రీరామ్.. తెలుగువారు శ్రీకాంత్ అని పిలుచుకుంటారు. 2002లో రోజాపూలు అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. హీరోగా తెలుగులో కూడా కొన్ని హిట్స్ అందుకున్నాడు. కానీ హీరోగా తెలుగు కంటే తమిళంలో సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు.
ఈ మధ్యకాలంలో అవకాశాలు నెమ్మదించడంతో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్నేహితుడు లాంటి సినిమాలలో ఫ్రెండ్ రోల్స్ చేశాడు. తాజాగా తెలుగు సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా‘లో పాల్గొన్నాడు శ్రీకాంత్. తన కెరీర్, లైఫ్ గురించి ఎన్నో విషయాలు చెప్పిన శ్రీకాంత్.. ఓ సినిమా టైంలో అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా శరీరం కాలిపోయిందని ఎమోషనల్ అయ్యాడు.
ఆ ప్రమాదంలో తన చెవులు, బాడీ చర్మం, తన వెనక భాగంలో జుట్టు, కాళ్ళు చేతులు ఇలా పూర్తిగా కాలిపోయి హాస్పిటల్ లో కదలలేని స్థితిని అనుభవించానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీరామ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నటుడు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.