రియల్ స్టార్ శ్రీహరి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. విలన్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో శ్రీహరి ఓ వైవిధ్యమైన హీరోయిజాన్ని క్రియేట్ చేశారు. సహాయ నటుడిగా కూడా అనే చిత్రాల్లో శ్రీహరి నటించారు. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేస్తాడు అనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన 2013 అక్టోబర్ 9న మరణించారుమరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శ్రీహరి చనిపోయి ఏళ్లు గడుస్తున్న.. ఆయన్ని అభిమానించేవాళ్ళు ఇప్పటికీ ఆ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీహరికి మరణంకి సంబంధించిన విషయాలను గతంలో ఆయన సతీమణి డిస్కో శాంతి తెలిపారు. తాజాగా మరోసారి ఓ ఇంటర్యూల్లో పాల్గొని షాకింగ్ విషయయాలను బయటపెట్టింది.
శ్రీహరి వ్యక్తిగత జీవితం అందరికి తెలిసిందే. డిస్కో శాంతిని ప్రేమించి 1996 వివహాం చేసుకున్నారు. డిస్కో శాంతి పెళ్లి సమయానికి ఐటమ్ సాంగ్స్ లో ఫుల్ క్రేజ్ లో ఉంది. సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలోని నటించింది. శ్రీహరి, శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. అంత హాయిగా సాగుతున్న వారి జీవితంలో శ్రీహరి మరణం.. ఆయన కుటుంబాన్ని కష్టాల్లోకి పడేసింది. తాజాగా ఆమె మరో ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. “నా భర్త శ్రీహరి చనిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆయన బ్రతికున్న రోజులో సాయం కోసం ఎవరు ఇంటికి వచ్చిన లేదనకుండా చేసేవారు. సినిమాల్లో ఆయన ఎన్నో కోట్లు సంపాదించారు. కానీ ఇప్పుడు మాత్రం మా కుటుంబ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారింది” అని శాంతి చెప్పుకొచ్చారు.
శ్రీహరి ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు మేఘాంశ్ “రాజ్ దూత్” అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకుల్లో మిక్సడ్ టాక్ ని సొంతం చేసుకుంది. తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కోతి కొమ్మచ్చి అనే చిత్రాన్ని మొదలు పెట్టారు. అయితే సినిమా షూటింగ్ పూర్తైందని టాక్. అయితే ఇప్పటి వరకు ఆ సినిమా ఇంక విడుదల కాలేదు. అదే శ్రీహరి కనుక బత్రికే ఉంటే మేఘాంశ్ ఇండస్ట్రీ అరంగ్రేటం వేరేలా ఉండేదని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా డిస్కో శాంతి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.