బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై కేసు నమోదైంది. పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సోనూ సూద్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ మెగాలో కేసు నమోదు చేశారు. ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై మోగాలో కేసు నమోదైంది. కాగా, సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోగాలో పోటీ చేస్తున్నారు. ఆమె కోసం ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఒక నటుడు పోలింగ్ బూత్ వద్దకు వెళ్తే ఓటర్లపై ప్రభావం పడుతుందని ప్రత్యర్థి పార్టీల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: బంగారు గనిలో భారీ పేలుడు.. 59 మంది మృతి
సోనూ సూద్ ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు. అలాగే, పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ ఈ కేసును నమోదు చేశారు. ఇక శోరోమణి అకాళీదల్ చేసిన ఫిర్యాదు మేరకు.. ఎన్నికల సంఘం అధికారులు పోలీగ్ బూత్‌ల దగ్గరకు వెళ్లకుండా సోనూ సూద్ కార్‌ను కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.