ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. నిన్న కేజీఎఫ్ నటుడు కృష్ణ జీ రావు కన్నుమూసిన విషాద వార్త మరువక ముందే.. మరో హాస్యనటుడు కన్నుమూయడంతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.
ప్రముఖ తమిళ హాస్య నటుడు శివ నారాయణమూర్తి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం శివ నారాయణమూర్తి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం తమిళనాడులోని పట్టుకోట్టై జిల్లా లోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు (డిసెంబర్ 8) సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. శివ నారాయణమూర్తికి భార్య పుష్పవల్లి, ఇద్దరు కుమారులు లోకేష్, రామ్‌కుమార్, ఒక కుమార్తె శ్రీదేవి ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలోకి మురళి హీరోగా నటించిన ‘పూంతోట్టం’ మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
తమిళంలో శివ నారాయణమూర్తి 200 పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. కోలీవుడ్ లో రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. అంతేకాదు శివ నారాయణమూర్తి ఎక్కువగా వివేక్, వడివేలుతో కలిసి హాస్యాన్ని పండిచాడు.. అందుకే ఆయన కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యారు. శివ నారాయణమూర్తి ఆకస్మిక మరణంతో కోలీవుడ్ అభిమానులు, సినీ తారలు దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Tamil comedy actor #SivaNarayanaMurthy (68) passed away. He appeared mostly in policeman or village chieftain comedy track along with Vadivelu or late Vivek.#omshanti pic.twitter.com/pRPcVvJhEc
— Sreedhar Pillai (@sri50) December 8, 2022